Physical Harassment: కోల్‌కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు
- కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి
- ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులు
- హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులు
- తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన మహిళ
- ఆమె నిద్రిస్తున్న సమయంలో సంఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి మహిళపై వేధింపులకు పాల్పడ్డాడు. హెల్త్ వర్కర్ అయిన 26 ఏళ్ల మహిళపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తన బిడ్డను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చింది. అయితే.. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కోల్‌కతాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఐసీహెచ్)లోని పిల్లల వార్డులో తాను నిద్రిస్తున్నానని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల తనయ్‌పాల్‌గా గుర్తించారు.
Horrifying incident: చేతబడి అనుమానం.. ఒకే కుటుంబంలోని ఐదుగురి హత్య..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నివేదిక ప్రకారం.. తనయ్ పాల్ పిల్లల వార్డుకు వచ్చి మహిళను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. ఆమె వస్త్రాలను కూడా విప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న కోల్‌కతా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇండియన్ జస్టిస్ కోడ్ (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా.. నిందితుడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. ఆ తరువాత.. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా.. పోలీసు కస్టడీకి ఇచ్చింది.
Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..
మరోవైపు.. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం-హత్య కేసుపై బెంగాల్ లో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ కేసులో సిబిఐ ఆదివారం మెడికల్ ఇనిస్టిట్యూట్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్‌లను కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో ఘోష్‌పై సాక్ష్యాలను తారుమారు చేసినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. అవినీతి కేసులో ఘోష్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మండల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!