రైతులకు, సైనికులకు కాంగ్రెస్ ద్రోహం చేసింది హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కురుక్షేత్రలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ ఖాయమన్నారు. ఈ ర్యాలీలో సీఎం నయాబ్ సైనీపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. అలాగే భాజపా చెప్పింది.. కచ్చితంగా చేస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితమే తాము హర్యానాకు ప్రయోజనం కలిగించే…
దులీప్ ట్రోఫీలో భారత యువ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తున్నారు. దేశవాళీ టోర్నీ రెండో రౌండ్ ప్రారంభమైంది. ఇండియా A, ఇండియా D మధ్య గట్టి పోటీ కనిపించింది. ఇండియా B, ఇండియా C తలపడుతున్నాయి. శనివారం భారత్ D ముందు 488 పరుగుల లక్ష్యం ఉంది. ఈ క్రమంలో.. స్టంప్స్ సమయానికి యష్ దూబే15 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, రికీ భుయ్ 44 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ నెల 16న నిమజ్జనం రోజు వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి మరుసటి రోజు 17 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు…
చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మీరట్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో 50 ఏళ్ల నాటి మూడంతస్తుల భవనం కూలిపోయింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో.. కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. ఇంట్లో ఉన్న 8 మందికి పైగా సమాధి అయినట్లు సమాచారం.
అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడరని, రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు. అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నామని, సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించామన్నారు. కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో,…
ముంబయి నటి కాదంబరి జేత్వాని ఫిర్యాదుతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు తనను, తన కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్ట్ చేశారని జేత్వాని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
సూర్య భార్య దేవిషా శెట్టి తన భర్త పుట్టినరోజు సందర్భంగా ప్రేమతో నిండిన ఓ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేవిష పెట్టిన పోస్ట్‌కి సూర్య ఒక్క మాటలో సమాధానమిచ్చి తన భావాలను మొత్తం బయటపెట్టాడు.
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.
అత్యధిక సిక్సర్లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కేవలం ఐదు సిక్సులు కొడితే.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అవతరిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.