కవాల్ పులుల అభయారణ్యంలోకి వెళ్లిన మగపులి ఆచూకీ గత 10 రోజులుగా కనిపించకపోవడంతో అటవీశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని తడోబా అంధారి టైగర్స్ రిజర్వ్ నుండి వచ్చిన పులి మొదట్లో కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లోకి ప్రవేశించి కొన్ని వారాల క్రితం ఆసిఫాబాద్ డివిజన్ వైపు మళ్లింది. రెండేళ్ల విరామం తర్వాత రిజర్వ్‌లోకి ప్రవేశించిన తొలి పులి ఇదే. పులి రాక అటవీశాఖ అధికారులను ఉర్రూతలూగించింది. రిజర్వ్‌లో పెద్ద పిల్లి కదలికలను రికార్డ్ చేయడానికి CCTV…
ఢిల్లీలో సీతారాం ఏచూరి పార్థివ దేహానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నానని తెలిపారు. మంచి నాయకుడు, ఎల్లప్పుడూ పేద ప్రజలకు ఏం చేయాలని తపనపడే వ్యక్తి అని అన్నారు. తాను 40 సంవత్సరాలుగా క్లోజ్ గా సీతారాం ఏచూరిని వాచ్ చేశానని.. ఏచూరితో కలిసి పని చేశానని చంద్రబాబు చెప్పారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వస్టేషన్ లో జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడంతో పాటు అతడి నుండి 18.5కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ జీఆర్పీపీ డిఎస్పి ఎస్ ఎన్ జావేద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇన్ స్పెక్టర్ సాయీశ్వర్ గౌడ్ ఆద్వర్యంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో ఒడిశాకు చెందిన సుదర్శన్ గంజాయి బ్యాగ్ లతో పట్టుపడ్డాడని డీఎస్పీ తెలిపారు. చాయి అమ్ముకునే సుదర్శన్ సులభంగా…
మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏలేరు రిజర్వాయర్‌కు అంత పెద్దమొత్తంలో వరద వచ్చినా ప్రాణ నష్టం జరగలేదంటే ప్రభుత్వ అప్రమత్తతే కారణమని మంత్రి పేర్కొన్నారు. 114 చోట్ల కట్ట బలహీనతలు గుర్తించి పటిష్టపరిచి ఆస్తి నష్టాన్ని తగ్గించామని తెలిపారు. ఏలేరు రిజర్వాయర్ గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బిఆర్ఎస్ నాయకులు కళ్ళలో నిప్పులు పోసుకుని బ్రతుకుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవితాంతం కెసిఆర్ కుటుంబమే పరిపాలిస్తుందని బిఆర్ఎస్ నాయకులు భ్రమల్లో బతికారని, రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామికంగా ఆలోచించి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారన్నారు. ప్రజల సమస్యలను ప్రజాపాలన ద్వారా పరిష్కరిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజు నుండే కూల్చేస్తాం,కూలగొడతామంటూ అంటూ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్…
ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్ సిఎ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ టీం, చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25లక్షల నగతు బహుమతిని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. హెచ్‌సీఏ టీమ్ కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా…
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేశ్.. రిమాండ్ ఖైదీగా గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ సమయంలో నందిగం సురేష్ తమకు సహకరించలేదని కేసులో దర్యాప్తు కోసం.. విచారణ చేసుకునేందు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.
సంతోషకరమైన, ఉత్సాహపూరితమైన నేపథ్యంలో, దిగ్గజ బ్రాండ్, CMR షాపింగ్ మాల్, మేడ్చల్‌లో తన 34వ శాఖను శుక్రవారం, 13 సెప్టెంబర్ 2024న ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ ప్రారంభించారు. TTD కల్యాణ మండపం సమీపంలో మేడ్చల్ బస్ స్టాండ్ ఎదురుగా తెరవబడిన ఈ తాజా సదుపాయం CMR షాపింగ్ మాల్ యొక్క తెలంగాణలో 11వ శాఖ , మొత్తం మీద 34వది. సెప్టెంబరు 6న తెలుగు రాష్ట్రాల వెలుపల తన మొట్టమొదటి…
కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లో వెళ్ళి ఏలేరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాలు పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని జగన్ ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబును ఇమిటేట్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ఇమిటేట్ చేశారు.
రష్యా – ఉక్రెయిన్ సరిహద్దులో చిక్కుకుపోయిన నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సూఫీయాన్ (24) ఎట్టకేలకు ఇండియాకు చేరుకున్నారు. గత రెండేళ్లు గా దుబాయ్ హోటల్ లో పని చేస్తున్న సూఫియాన్ తో పాటు మరో నలుగురిని అక్కడి నుండి రష్యా పంపించి నమ్మించి రష్యా భాషలో ఉన్న అగ్రిమెంట్ కాగితాల పైన సంతకాలు చేయించి సైన్యం లో చేర్పించాడు ఏజెంట్. వారి కోసం కుటింబీకులు నానా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ కు చెందిన హసన్…