తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. లాంఛనప్రాయ కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసి, పార్టీని నూతనోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.…
ఖైరతాబాద్ గణేషుడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్రలో మన ఖైరతాబాద్ గణేష్‌ది అని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులదని, ఈ సంస్కృతి నీ రాబోయే తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు. ఆనాడు బాలా గంగాధర్ తిలక్ భారతీయులను ఒక్క తాటిమీదికి తేవడానికి వినాయక…
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది.
టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ ఎక్స్పర్ట్ ఆకాష్ చోప్రా.. ఇటీవల టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పారు. ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పారు. అందులో.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు.
“Prophet for the World” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందన్నారు. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం ప్రపంచ శాంతి మాత్రమేనని, కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయని, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఓవైసీ, మరో…
బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
సెప్టెంబరు 16న వచ్చే మిలాద్-ఉన్-నబీ కోసం నగరమంతటా ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రవక్త మహమ్మద్ జయంతిని సూచిస్తుంది , హిజ్రీ క్యాలెండర్‌లోని మూడవ నెల రబీ ఉల్ అవల్ నెల 12వ రోజున జరుపుకుంటారు. రోజున, కమ్యూనిటీ గ్రూపులు రక్తదానం, పండ్ల పంపిణీ, వస్త్రదానం, మతపరమైన సమావేశాలు , ఇస్లాం సంబంధిత అంశాలలో పోటీలు నిర్వహిస్తాయి. వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పేదలకు , నిరుపేదలకు కూడా ఆహారం అందించబడుతుంది. ఈ సందర్భంగా…
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సెలబ్రిటీ క్రష్ అని అనన్య పాండే చెప్పింది. కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘కాల్ మీ బే’ ప్రమోషన్లలో భాగంగా అనన్య ఈ వ్యాఖ్యలు చేశారు.