Lorry Incident: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి. లారీలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు కావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం కావడంతో, షాప్ మూసి ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. కూరగాయల దుకాణం మొత్తం ధ్వంసమైంది. దీంతో షాప్ యజమాని, ద్విచక్ర వాహన యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
Read Also: Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..