Russia-Ukraine War: మాస్కోలో విమానాల రాకపోకలు నిలిపివేత.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine War: ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడుతుందనే అనుమానంతో రష్యా మాస్కోలోని రెండు విమానాశ్రయాల్లో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. రష్యా రాజధాని మాస్కోకు నైరుతి దిశలో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్నుకోవో విమానాశ్రయం, కలుగా విమానాశ్రయాల్లో విమానాలను తాత్కాలికంగా నిలివేశారు. ఈ రోజు ఉదయం 10.50 నుంచి విమానాలపై ఆంక్షలు తొలగించబడ్డాయని, ప్రస్తుతం విమానాశ్రయం సాధారణంగా పని చేస్తోందని వ్నుకోవో విమానాశ్రయం అధికారులు వెల్లడించారు.
Also Read: Raghav Chadha: రాజ్యసభ నుంచి ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్
Also Read
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
అంతకుముందు విమానాశ్రయం నియంత్రణకు మించిన కారణాల వల్ల అన్ని విమానాలను సస్పెండ్ చేయవలసి వచ్చిందని విమానాశ్రయం పేర్కొంది. కొన్ని విమానాలు మాస్కో ప్రాంతంలోని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించబడ్డాయని వెల్లడించింది. రష్యా రాజధానిపై డ్రోన్‌ను కూల్చివేసినట్లు మాస్కో మేయర్ తర్వాత తెలిపారు. విమానాశ్రయాల మూసివేతకు దీనికి సంబంధం ఉందా లేదా అనేది వెంటనే స్పష్టంగా తెలియలేదు. మే ప్రారంభంలో క్రెమ్లిన్‌పై డ్రోన్ దాడి జరిగినప్పటి నుంచి రష్యాలో ఎక్కువగా డ్రోన్ వైమానిక దాడులు పెరిగాయి. మే తర్వాత రాజధానిలోని పౌర ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఈ నెల ప్రారంభంలో మూడు రోజులలో రెండుసార్లు మాస్కో వ్యాపార జిల్లాను లక్ష్యంగా చేసుకున్నారు.
మాస్కో, క్రిమియాలోని అతిపెద్ద నగరంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న 13 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు రష్యా గురువారం తెలిపింది. ఇటీవల ఉక్రెయిన్‌కు చెందిన డ్రోన్‌లు నల్ల సముద్రంలోని రష్యా నోవోరోసిస్క్ పోర్ట్ వద్ద రష్యన్ ఇంధన ట్యాంకర్, నౌకాదళ స్థావరంపై దాడి చేశాయి.
తాజావార్తలు
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!