నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్మట్ బ్యారేజ్‌పై తెలంగాణ ప్రభుత్వం పట్టింపేదని ఆయన ప్రశ్నించారు. రజాకార్ల హయాంలో వచ్చిన సాగునీరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేక పోతుందని, ఖానాపూర్, కడెం రైతుల వర ప్రదాయిని సదర్మట్ అయకట్ట మనుగడ కోల్పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. సత్వరమే కెనాల్ గండ్లు పూడ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Minister Roja: పవన్ ఆటలో అరటిపండు.. మంత్రి రోజా ఘాటు విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో కడెం ప్రాజెక్టు అనేది వుందో లేదో అర్ధం కావడం లేదని ఆయన మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గత సంవత్సర భయానక పరిస్థితి నుండి మరమ్మతులు చేయక పోవడం.. మొన్నటి విప్పత్తు తోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి జీవన్ రెడ్డి అన్నారు. రుణ మాఫీ పై స్పష్టమైన ఆదేశాలు లేవని రుణ మాఫీ వడ్డీ మాఫీకే పోతుందని విమర్శించారు. రైతులను ఆందోళనకు గురిచేయకుండా ఆదిశగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాల కాలం నుండి రోళ్ళ వాగుపై ఆదరపడ్డా మత్స్యకారులు ఉపాధి లేక నష్టపోతున్నారని ప్రభుత్వం వారిని ఆదుకునేల చర్యలు చేపట్టాలని కోరారు.ఇప్పటి వరకు రోళ్ళవాగుకు షటరు బిగించక పోవడంతో నీటిని నిల్వచేసే సామర్ద్యంకు అవకాశం ఉండదని తెలిపారు.
Also Read : Air India: ఎయిర్ ఇండియా లోగో, డిజైన్ మారింది..చూశారా !