ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగున్న అధికార పార్టీ నేతలు.. తాజాగా ట్విట్టర్ లో చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబు గారు.. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడీలను మించిపోయారని, సరికొత్త పద్ధతిలో విద్యుత్‌ను కనిపెట్టారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. మైక్ ఇస్తే చాలు ఏదో మాట్లాడుతున్నారన్నారు. రెండు రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టానని అంటారేమో.. హతవిధీ! అని ట్వీట్ చేశారు.
బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడిలను మించి పోయారు చంద్రబాబు గారు. సరికొత్త పద్దతిలో విద్యుత్ కనిపెట్టారు – మైక్ ఇస్తే చాలు ఎదో మాట్లాడటం. రెండ్రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టా అంటారు కాబోలు! హతవిధీ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 11, 2023
Hyderabad: ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగే ప్రదేశాలు
అంతేకాకుండా మరో ట్వీట్ కూడా చేశారు. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు రావడం ఖాయమని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండో స్థానానికి గట్టి పోటీ ఏర్పడిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లు జనసేన పార్టీకి, జనసేన పార్టీ ఓటర్లు బీజేపీకి మారుతారనే అభిప్రాయం బలంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ.. వైసీపీ మాత్రం 51 శాతం ఓటింగ్‌తో అద్భుత విజయం సాధిస్తుందన్నారు. ప్రతిపక్షాలు 2024కు బదులు 2029 ఎన్నికలపై దృష్టి సారించాలని విజయసాయి చురకలు అంటించారు.
For the AP 2024 elections, the toughest competition is for the distant 2nd position. There is a strong undercurrent that loyal TDP voters will shift to JSP, and the JSP voters to BJP. Whatever it might be, my opinion is that the opposition in AP should start preparing for 2029…
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 11, 2023