స్కూలు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత పలుమార్లు బాలికను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది.
అమెరికాలో హవాయి ద్వీపంలో ఏర్పడిన భీకర కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. అగ్నికీలలకు బలమైన గాలులు తోడవడంతో మౌయి ద్వీపం అల్లకల్లోలంగా మారింది. వేల ఇళ్లు అగ్నికి బూడిదయ్యాయి. దావాగ్ని వల్ల ఇప్పటివరకు 67 మంది మరణించారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన హర్యానాలోని నుహ్లో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవల సస్పెన్షన్ను హర్యానా ప్రభుత్వం శుక్రవారం వరకు పొడిగించింది. ఈ నెల ప్రారంభంలో హర్యానాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 393 మందిని అరెస్టు చేశారు.
పశ్చిమ ఢిల్లీలోని ఇందర్పురి ప్రాంతంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని ఓ మహిళ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాలుడి నివాసంలోని బెడ్బాక్స్లో మృతదేహం లభ్యమైంది.
చారిత్రక గోల్కొండ కోటలో ఆగష్టు 15న నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆగష్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని డీజీపీ తెలిపారు. ఈకార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. breaking news, latest news, telugu news, big news, dgp…
శుక్రవారం చంబా జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం సియుల్ నదిలో పడటంతో ఏడుగురు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది.
ఈరోజు హైద్రాబాద్ లో TSMIDC కార్యాలయంలో ఆవరణ లో ఆరోగ్య శాఖ కు సంబంధించిన ఒక యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, dh srinivas rao
ఈక్వెడార్ అధ్యక్ష అభ్యర్థి ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు గురైన నేపథ్యంలో గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదే సమయంలో హత్యపై దర్యాప్తులో సహాయం చేయాలని ఎఫ్బిఐని కోరారు. 59 ఏళ్ల జర్నలిస్ట్, అవినీతి వ్యతిరేక క్రూసేడర్ ఫెర్నాండో విలావిసెన్సియో హత్యకు సంబంధించి ఆరుగురు కొలంబియన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.