26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రతిపక్ష కూటమి పేరు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్) అని తెలిసిందే.
అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్ ను దుయ్యబట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. అసలు నీ విధానం ఏంటి? పార్టీ ఏంటంటే సమాధానం లేదన్నారు మంత్రి. 15 ఏండ్లు అవుతుంది రాజకీయ దుకాణం తెరిచి.. ఆ దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీలేదని ఆరోపించారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
పెద్దపల్లి జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ కుల వృత్తులకు, చేతి వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ పత్రాల పంపిణీ చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. breaking news, latest news, telugu news, big news, koppula eshwar, bc bandhu
మణిపూర్లో మహిళలు ఘోరమైన అఘాయిత్యాలకు గురవుతున్న తీరుపై వేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఓ వర్గానికి అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు లైంగిక హింసకు పాల్పడుతున్నారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. దూరం నుంచే కొండను పరిశీలించిన పవన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, రుషికొండ నిర్మాణాలపై తీవ్ర విమర్శలు చేసారు. తట్టెడు మట్టి తీస్తేనే పర్యావరణ ఇబ్బందులు వచ్చే చోట విధ్వంసం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే అయితే సర్క్యూట్ హౌస్, ఇతర చోట్ల కట్టవొచ్చు కదా అని జనసేనాని ప్రశ్నించారు.
హుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కు పర్యాటక అనుమతులు రావడం సంతోషకరమని ఆమె అన్నారు. breaking news, latest news, telugu news, sabitha indra reddy, cm kcr