రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లోని 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరోసారి తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మేడ్చల్ పార్లమెంటరీ విస్తృత సాయి కార్యవర్గ సమావేశం.. నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.. తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా గుర్తింపు ఉన్న మల్కాజ్గిరి రాబోవు ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు తెలిపారు.
Also Read : Cheetah: 22 రోజులుగా కనపడకుండా పోయిన చిరుత.. ఆచూకీ లభ్యం
ఎన్నికల్లో పోటీ చేస్తామని భయపడి బీఆర్ఎస్ నాయకులు తరచు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అని ప్రచారాలు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు అంతట ఉన్నారని వారిని మేల్కొలిపి ఓటు వేసేందుకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు.. తెలుగుదేశం పార్టీ లేదని అన్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం కావాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షునిగా అశోక్ ప్రమాణ స్వీకారం చేయగా పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు రావు 100 రోజుల ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయి వార్డు స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఒక్కరు ఓటరును ఓటు వేసేందుకు తీసుకువచ్చే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
Also Read : Prem Kumar: కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది.. ‘ప్రేమ్ కుమార్’ దర్శకుడు అభిషేక్ మహర్షి