గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లో ఎలుక కలకలం సృష్టించింది. ట్రైన్ నంబర్ 12728 హైదరాబాద్ నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు 3rd AC కోచ్ B4లో క్యాబిన్ కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో బోనకల్ స్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది. దాంతో ఒక్క సారిగా రైలు నిలిపేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్ నెలకొంది. ఎలుకను బయటకు తీసిన తర్వాత రైలు తిరిగి బయలు దేరింది.
Also Read : BCCI Twitter DP: ట్విటర్ డీపీ మార్చిన బీసీసీఐ.. కారణం ఏంటంటే?
వివరాల్లోకి వెళితే.. ట్రైన్ నంబర్ 12728 హైదరాబాద్ నుంచి నుంచి వైజాగ్ వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ థర్డ్ ఏసీ బీ4 కోచ్‌లో ఎలుక కంగారు పెట్టింది. క్యాబిన్ కంట్రోల్ పానెల్‌లోకి ఎలుక దూరటంతో ఆకస్మాత్తుగా పొగలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి 10.15 గంటల సమయంలో ఖమ్మం విజయవాడ మధ్యలో ఉన్న బోనకల్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. దాంతో ట్రైన్‌ను ఆకస్మాత్తుగా నిలిపివేశారు. సుమారు 20 నిమిషాల పాటు రైల్వే సిబ్బంది, ప్రయాణికుల్లో టెన్షన్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ నేపథ్యంలో కలవరపాటుకు లోనయ్యారు. రైల్వే సిబ్బంది చివరకు ఎలుకను బయటకు తీయటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ట్రైన్ అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయింది.
Also Read : Power Bill Cyber Crime: భారీ సైబర్ మోసం.. 5 రూపాయలు పంపగానే, 1.85 లక్షలు హాంఫట్