వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయన్నారు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించామన్నారు.. Komatireddy Venkat Reddy, telugu news, big news, congress,
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని అన్నారు.
మణిపూర్లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్సభలో ప్రవేశపెట్టారు. సమీక్ష కోసం పార్లమెంట్కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది.
ఉత్తరాఖండ్లో విషాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
మణిపూర్లో భారత సైన్యం దేనినీ పరిష్కరించదు అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం అన్నారు. ఇప్పుడు 100 రోజులకు పైగా కొనసాగుతున్న జాతి హింసకు పరిష్కారం బుల్లెట్ల నుంచి కాకుండా గుండెల నుంచి రావాలన్నారు.
నాగ్పూర్ బీజేపీ నాయకురాలు సనా ఖాన్ అదృశ్యమైన పది రోజుల తర్వాత.. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆమెను హత్య చేసినందుకు ఆమె భర్త అమిత్ సాహును శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐదు టీ20ల సిరీస్లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ గెలిచేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. రెండూ మ్యాచ్లు ఓడిపోయి మరో ఓటమి ఎదురైతే సిరీస్ చేజారే పరిస్థితిలో పుంజుకున్న టీమిండియా.. మూడో టీ20లో గెలిచి హమ్మయ్య అనుకుంది.