తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు టీటీడీ బోర్టు హైలెవల్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అయితే.. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, టీటీడీ సీవీ అండ్ ఎస్వోతో పాటు మరికొంత మంది అధికారులు పాల్గొననున్నారు. ప్రధానంగా..నడకదారి భక్తుల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చించనుంది టీటీడీ బోర్డు. దర్శన టోకెన్ కోసం నడకదారిన వచ్చే భక్తుల ఇక్కట్లు తొలగించాలని భావిస్తోన్న టీటీడీ.. నడకదారి భక్తులకు జారి చేసే దర్శన టోకెన్ల విధానాన్ని రద్దు చేసి.. సర్వదర్శన టోకన్లు పెంచే యోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం జారీ చేస్తున్న 15 వేల టోకెన్ల సంఖ్యను 30 వేలకు పెంచే అవకాశముంది. వీటన్నింటితో పాటు… మరికొన్ని కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది..
Also Read : Nani Controversy: పాన్ ఇండియా స్టార్ వ్యాఖ్యలు.. నానిపై మండిడుతున్న బడా హీరోల ఫ్యాన్స్
ఇదిలా ఉంటే.. తిరుమల అలిపిరి రోడ్డులో బాలికపై దాడి చేసిన చిరుతను ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ఓ బాలికపై చిరుత దాడి చేసి మృతి చెందడంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు అలిపిరి నడకదారిలో బోనును ఏర్పాటు చేశారు. గత రాత్రి ఆ ప్రాంతంలో సంచరించిన చిరుత బోనులో చిక్కుకుంది. గత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. అలిపిరి మార్గంలో మూడు చిరుతలు సంచరిస్తున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన ఆడ చిరుతగా గుర్తించారు. రాత్రి బోనులో చిక్కుకున్నది ఆడ చిరుతపులి అని ధర్మారెడ్డి తెలిపారు. నామాల బావికి సమీపంలో ఉన్న బోనులో చిరుత చిక్కుకుందని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Also Read : K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?