1. నేడు భూమన అధ్యక్షతన టీటీడీ బోర్డు సమావేశం. యాత్రికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
2. నేడు విద్యా శాఖ పై సీఎం జగన్ సమీక్ష. స్కూళ్ళల్లో నాడు నేడు పనుల పురోగతి, సీబీఎస్ఈ సిలబస్ అమలు తదితర అంశాల పై చర్చ. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం.
3. నంద్యాల : నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం.
4. తూర్పుగోదావరి జిల్లా : నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాజమండ్రి నుండి విజయవాడ మధ్య రాకపోకలు సాగించే పలు రైళ్ల దారి మళ్లింపు. రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, గుడివాడ ల మీదుగా విజయవాడకు దారి మళ్లింపు. ఎర్నాకులం-పాట్నా, బెంగుళూర్-గౌహతి, కోయంబత్తూర్- సిల్చారు, భావనగర్- కాకినాడ పోర్ట్ ల మధ్య నడిచే రైళ్లు దారి మళ్లింపు.
5. విశాఖ : మంత్రి గుడివాడ అమర్నాథ్ అడ్డాలో పవన్ కల్యాణ్ పర్యటనపై పెరుగుతున్న ఉత్కంఠ. నేడు కశింకోట మండలం విస్సన్నపేటకు వెళ్లనున్న జనసేనాని.. మారేడుపూడి జంక్షన్ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసిన స్థానిక నాయకత్వం.
6. తిరుమల : నడకదారిలో భక్తుల భద్రతా చర్యలలో భాగంగా కొనసాగుతుమ్న ఆంక్షలు. ఘాట్ రోడ్డులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాల అనుమతి. నడకదారిలో 15 సంవత్సరాల లోపు చిన్నారులను ఉదయం 6 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే అనుమతి.
7. నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్. బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం వరద నష్టపరిహారం డిమాండ్లతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మహా ధర్నా పిలుపునిచ్చిన కాంగ్రెస్.
8. నిజామాబాద్ : నేడు వేల్పూర్ లో కాంగ్రెస్ రైతు నిరసన సభ. హాజరు కానున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ సభతో.. రైతు నిరసన సభ కు ప్రాధాన్యం.
9. కామారెడ్డి : నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సుమారు 53 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపణలు ప్రారంభోత్సవాలు. ఎల్లారెడ్డి బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్.
10.నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన? జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజ్ పత్రాలు అందజేయనున్న మంత్రి. ఈ నెల 19న సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను పరిశీలించనున్న మంత్రి హరీష్ రావు.