రోజూ నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధిక బరువు ఉండి ఇబ్బంది పడుతుంటే రోజూ నడవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా నడక మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మీరు ఎంత ఎక్కువ దూరం నడిస్తే, మీ వయస్సును అంత పెంచడంలో సహాయపడుతుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు రోజువారీ దినచర్యలో నడకను అలవాటు చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడున్న కాలంలో.. బిజీబిజీగా గడపడం అలవాటై పోయింది. రోజువారీ వ్యాయామం కోసం ఒకటి నుండి రెండు గంటల సమయం కేటాయించడానికి కూడా సమయం ఉండటం లేదు. అందుకు బాధపడాల్సిన అవసరం లేదు. నడక ద్వారా కూడా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎంత ఎక్కువ దూరం నడిస్తే.. అంత ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడవడం ద్వారా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.
Leopard at SV University: తిరుపతిలో చిరుత కలకలం.. ఎస్వీ వర్సిటీలోకి ఎంట్రీ..
మీరు ప్రతిరోజూ 500 నుండి 1000 అడుగులు నడిస్తే, గుండె జబ్బులు లేదా మరేదైనా కారణాల వల్ల మరణించే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం 2337 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల నుండి మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 3967 అడుగులు నడవడం వల్ల ఇతర వ్యాధుల నుండి మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు 500 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 7 శాతం తగ్గుతుందని, 1,000 అడుగులు నడవడం వల్ల రిస్క్ 15 శాతం తగ్గుతుందని అధ్యయనం కనుగొంది. కుర్చీలో నుంచి కదలకుండా చేసే జాబులున్నవాళ్లు కనీసం రోజుకు 5 నుంచి 7 వేల అడుగులైనా వేయడం మంచిదని చెబుతున్నారు. మీరు చేసే పనులు, శారీరక శ్రమను బట్టి రోజుకు ఎన్ని అడుగులు వేయాలనేది నిర్ణయించుకోవాలి.
Shruti Haasan: ఏంటి శృతి ఇలా తయారయ్యావ్…లేటెస్ట్ పిక్స్ చూశారా?
ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు కనీసం 2000 నుంచి 2500 అడుగులు వేయాలి. కానీ బిజీ షెడ్యూల్ల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. మెడిసిన్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్‌సైజ్ నివేదిక ప్రకారం అరగంటకోసారి 5 నిమిషాలు నడవడం వల్ల ఎక్కువ సేపు కూర్చుని పని చేసిన తాలూకు అనారోగ్యం తగ్గుతుంది. చక్కెర స్థాయిలు, బీపీ తగ్గిస్తుంది. అరగంటకోసారి 5 నిమిషాలే అంటే తక్కువే అనిపించొచ్చు. కానీ ఆ అయిదు నిమిషాలన్నీ కలిపితే 40 నిమిషాలు. అంటే దాదాపుగా 4000 అడుగులు నడిచినట్లే. ఈ చిన్న ప్రణాళికతో ఉన్న చోట నుంచి మధ్య మధ్యలో కదులుతూ ఉండండి. ఎక్కువ చేయలేం కదాని ఏమీ చెయ్యకుండా ఉండటం సరికాదు. అస్సలే కదలకుండా ఉండటం కన్నా కదిలి చిన్న పని చేసినా మేలే అని గుర్తుంచుకోండి.