టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అరాచక శక్తుల మూక అని, చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెల్లని నాణాలు లాంటి పార్టీలు.. ఫుల్ సైజ్ ఆర్కెస్ట్రా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శబ్ద కాలుష్యం లాంటి విమర్శలు చేస్తున్నాయని, చేసింది చెప్పుకోవటానికి, ప్రజల ఆశీస్సులు మళ్ళీ పొందటానికి మేం ప్రయత్నం చేస్తున్నాం తాము చేసిన ఘన కార్యాలు చెప్పుకుని ప్రజల దగ్గరకు వెళ్ళే అవకాశం చంద్రబాబుకు ఉందన్నారు. దత్త పుత్రుడికి ఆ అవకాశం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Karumuri Nageswara Rao : సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్
అధికారంలో రావాలనే ఉద్దేశం కూడా దత్త పుత్రుడికి ఉన్నట్లు లేదని, వ్యక్తిత్వ హననం చేయటం, అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ వి కారు కూతలు.. ఎందుకు అంతలా ఊగటం.. సందర్భం లేకుండా ఆవేశంగా ఒక డైలాగ్ వేయటం.. సినిమా హీరో వేసే డైలాగులకు అభిమానుల నుంచి ఈలలు ఎక్కడైనా కనిపిస్తాయి.. మేం గట్టిగా మాట్లాడితే దాని పై ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబు.. అంగళ్ళు, పుంగనూరు దగ్గర చంద్రబాబు ఎలా రెచ్చగొట్టారో ప్రజలు అందరూ చూశారు.. పోలీసులు సంయమనంతో లేకపోతే ఘోరం జరిగి ఉండేది.. చంద్రబాబు అలాంటి ఘోరం జరగాలనే కుట్ర చేశారు.. తన పై హత్యాయత్నం జరిగిందని సీబీఐ విచారణ చేయాలని ప్రధానికి, రాష్ట్రపతి చంద్రబాబు లేఖ రాశారు.. ఇదే సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వను అని తాను అధికారంలో ఉన్నప్పుడు తీర్మానం చేశాడు చంద్రబాబు.. 9 పేజీల లేఖలో ఒక్క విషయం కూడా వాస్తవం లేదు’ అని ఆయన అన్నారు.
Also Read : Rahul Dravid: బ్యాటింగ్ లైనప్ బాలేదు.. సిరీస్ ఓటమిపై స్పందించిన రాహుల్ ద్రవిడ్!