కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని కైతాల్ లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ‘జన్ ఆక్రోష్ ర్యాలీ’లో సుర్జేవాలా పాల్గొని మాట్లాడారు. ‘‘ఉద్యోగం ఇవ్వకండి, కనీసం ఉద్యోగంలో కూర్చోవడానికి అవకాశం ఇవ్వండి. బీజేపీ, జేజేపీలో నాయకులు రాక్షసులు. బీజేపీకి ఓటేసి, వారికి మద్దతిచ్చే వారు కూడా రాక్షసులే. ఈ రోజు నేను ఈ మహాభారత భూమి నుండి శపిస్తున్నాను.’’ అని సుర్జేవాలా అన్నారు.
Read Also: Land Auction: మరోసారి భారీ భూ వేలం.. నోటిఫికేషన్ విడుదల
అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ.. తీవ్రంగా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలతో పార్టీ ఎప్పటికీ ప్రతిపక్షంలో ఉండాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. “పదేపదే ఎన్నికల ఓటములు కాంగ్రెస్‌ను అప్రస్తుతంలోకి నెట్టాయి. ” అని ఆయన అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. యువరాజు (రాహుల్ గాంధీ)ను పదేపదే లాంచ్ చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలను, జనార్ధన్ ను దూషించడం ప్రారంభించిందని ఆరోపించారు. ‘‘ప్రధాని మోడీ, బీజేపీ వల్ల అంధత్వానికి గురైన కాంగ్రెస్ నేత రణ్ దీప్ సూర్జేవాలా చెప్పిన మాటలు వినండి’’ అంటూ ఆయన ఈ వీడియోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.
Read Also: Vithika Sheru: బ్రా కలక్షన్స్ చూపించిన వరుణ్ భార్య.. సిగ్గుపడకండి
మరోవైపు తన వ్యాఖ్యలపై సూర్జేవాలా వివరణ ఇచ్చారు. భావోద్వేగ సమస్యల వెనుక బీజేపీ తన వైఫల్యాలను దాచిపెడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఉటంకిస్తూ, “సమాజాన్ని ద్వేషపూరిత మంటల్లోకి నెట్టి, యువకుల కలలను చంపిన వారు రాక్షసుల కంటే తక్కువేనా?” అని సుర్జేవాలా ప్రశ్నించారు.