తిరుపతి జిల్లాలోని పుత్తూరులో టిడ్కో ఇళ్లను మంత్రి రోజా పరిశీలించారు.ఈ క్రమంలోనే రూ.4.5 కోట్లతో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరిలోని జగనన్న నగర్ కాలనీలో మౌలిక వసతుల పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సుమారు 4.50 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. టిడ్కో ఇళ్ల కాలనీలో వసతులన్నింటినీ పూర్తి చేసి అతి త్వరలోనే లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండేలా చర్యలు తీసుకుంటామని, టిట్కో ఇళ్ల నిర్మాణం గత ప్రభుత్వంలో ప్రారంభమైనా, చంద్రబాబు నాయుడుకి, ఆ పార్టీ నాయకులకు చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి రోజా. టిట్కో ఇళ్ల దగ్గర టీడీపీ పప్పులు వచ్చి సెల్ఫీలు దిగారని, ఒకడేమో మంగళగిరి పప్పు…ఇంకోడేమో ఈ నగరి పప్పు అంటూ ఆమె విమర్శలు గుప్పించారు.
Also Read : Rashmika Mandanna: మరో పాన్ ఇండియా సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసిన రష్మిక..
అంతేకాకుండా.. ‘టిట్కో ఇళ్ల దగ్గర నిలబడి సిగ్గులేకుండా సెల్ఫీలు దిగారు.. ఆ సెల్ఫీలు దిగిన ఇద్దరు పప్పులను సూటి ప్రశ్నిస్తున్నా.. టిట్కో ఇళ్లలో, నీళళు, కరెంటు, రోడ్లు ఏమీ లేకుండా.. గాలికొదిలేసి..ఏ మొహం పెట్టుకుని సెల్ఫీ దిగారు… అవి సెల్ఫీ ఛాలెంజ్ లు కాదు.. టీడీపీ చేతకాని తనాన్ని నిరూపించే సెల్ఫ్ గోల్ లు.. ఈ నగరిలోనే కాదు.. ఈ రాష్ట్రంలో ఎక్కడా టిట్కో ఇళ్లను కట్టి ఇవ్వడం చేతకాని దద్దమ్మ చంద్రబాబు నాయుడు.. టిట్కో ఇళ్లలో జనం నుండి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు. కాంట్రాక్టర్ల నుండి వందల కోట్లు కొల్లగొట్టి, పేదల ఇళ్లలోను దోచుకున్న దోపిడీ అనకొండ ఈ చంద్రబాబు’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.
Also Read : T.Congress: నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ.. అభ్యర్థుల ఎంపికపై చర్చ..