జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు చిత్తూరు జిల్లా పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ.. సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని నిప్పులు చెరిగారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్ల పవన్ కల్యాణ్ ఏక వచనంతో సంబోధిస్తున్నాడని.. సంస్కారం లేని వ్యక్తి పవన్ అని ఆయన ధ్వజమెత్తారు. ప్రజా సేవలో ఉన్న వాలంటీర్ లు పట్ల నీచంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Bedurulanka 2012 : నేను అలా అనలేదు.. తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు: కార్తికేయ స్ట్రాంగ్ వార్నింగ్
అందరూ ముందుకు వెళ్లాలి అనుకుంటే.. ఇతను వెనక్కి వెళ్ళాలి అనుకుంటున్నాడని, పవన్ కల్యాణ్ కి మతిభ్రమించినట్లుగా ఉందని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడన్నారు మంత్రి కారుమూరి. ఎమ్మెల్యే అవ్వాలని, ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన పవన్‌కు లేదని, చంద్రబాబు నాయుడు కు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ గా మిగిలిపోతాడని మంత్ర కారుమూరి విమర్శించారు. గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చంద్రబాబు, పవన్ లకు ప్రజలే బుద్ది చెప్పుతారని మంత్రి కారుమూరి అన్నారు. మరోవైపు వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అవివేకం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
Also Read : Rashmika Mandanna: మరో పాన్ ఇండియా సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసిన రష్మిక..