అధికారంలోకి వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయనపై కేసు పెట్టాలని కోరుతూ వందలాదిమంది కాప్రా సర్కిల్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కేసీఆర్ వల్లే తెలంగాణ రాజకీయాలు డబ్బు చుట్టు తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారు అని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ కలహాల వల్లో లేక వేరే కారణాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. నిన్న తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కొడుకును గొంతు కోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది.. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ (సీపీఐ, సీపీఎం) పార్టీలతో పొత్తు ఉండదని తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించాయి. అయితే, పొత్తు విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం ఎలాంటి పొత్తు లేదని తేల్చి చెప్పింది.
ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.