కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడగడం విడ్డూరంగా ఉంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు కట్టింది ఎవరు..? యూనివర్సిటీలను కట్టింది ఎవరు..? కాంగ్రెస్ కాదా.. ఎస్ఎల్ బీసీ టన్నెల్ కు 2000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఇప్పటికే పూర్తయ్యేది అని ఆయన వ్యాఖ్యనించారు.
Read Also: Kottu Satyanarayana: పవన్ కల్యాణ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుంది.. అది స్పష్టం..!
కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో 70 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును 9 ఏళ్లలో కనీసం 30 శాతం కూడా కేసీఆర్ పూర్తి చేయలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. మేము రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తామన్నప్పుడు కరెంట్ వొద్దు అన్నా చంద్రబాబు పార్టీలో ఉన్నావు కేసీఆర్ నీవు అని కోమటిరెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ ఏం చేశాడని.. రాష్ట్రంపై ఐదు కోట్ల అప్పు చేశారు అని ఆయన విమర్శలు చేశాడు.
Read Also: Harassment of Bride: అయ్యో పాపం.. కొత్త పెళ్లికూతురి బట్టలు విప్పించి శీల పరీక్ష చేసిన అత్తామామ
తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ ను నిలదీయాలి అని కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు ఒకటో తారీఖున ఇచ్చాము.. కేసీఆర్ లెక్క 15వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు అని ఆయన పేర్కొన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజలను నేను చేతులు జోడించి అడుగుతున్నాను.. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.