రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం.
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్‌లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు…
పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తిరగపడ్తామ్ తరిమి కొడతాం అనే కార్యక్రమంపై చర్చించామని ఆయన తెలిపారు. ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 15 వరకు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల మీద మరింత వ్యతిరేకత ఉంది.. ఎమ్మెల్యేలు నియంతలా.. సామంత రాజులు అనుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.. ప్రభుత్వం వ్యతిరేక అంశాలు అన్ని జనంలోకి వెళ్ళాలి అని నల్గొండ ఎంపీ తెలిపారు.. ఎంత కష్టపడితే అంత మంచిది.. అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వస్తుంది.
ప్రతిపక్షాలు అనవసరంగా ఏఎన్ఎమ్ లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు మండిపడ్డారు. NHM కింద ఉన్న 2nd ఏఎన్ఎమ్ ల సమస్యలను అర్థం చేసుకొని మాట్లాడాలని కోరాము.. 5వేల 1వంద మంది సెకండ్ ఏఎన్ఎమ్ లు తెలంగాణలో వివిధ సేవలు అందిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.