కొత్త లుక్, మరింత కంఫర్ట్..! సరికొత్త హంగులతో Mahindra Bolero Pik-Up లాంచ్..!
- మహీంద్రా బొలెరో పిక్-అప్‌ను తాజా అప్‌డేట్స్‌తో అధికారికంగా లాంచ్
- కొత్త ఫ్రంట్ డిజైన్‌తో మరింత ఫ్రెష్, మోడర్న్ లుక్
- హెడ్‌రెస్ట్‌తో కూడిన రిక్లైనర్ డ్రైవర్ సీట్
- అన్ని వాతావరణాలకు అనుకూలంగా AC మరియు హీటింగ్ సిస్టమ్
- 2.5 లీటర్ శక్తివంతమైన డీజిల్ ఇంజిన్
- 2WD మరియు 4WD ఆప్షన్లలో అందుబాటు
- ధరలు రూ. 9.19 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్)...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Bolero Pik-Up: భారత కమర్షియల్ వాహన మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా మహీంద్రా & మహీంద్రా దూకుడుగా ముందుకు వెళ్తోంది. ప్రముఖ వాణిజ్య వాహనం మహీంద్రా బొలెరో పిక్-అప్ (Mahindra Bolero Pik-Up)ను తాజా అప్‌డేట్స్‌తో అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ అప్డేట్స్ ప్రధానంగా డ్రైవర్ కంఫర్ట్, అన్ని వాతావరణాలకు అనుకూలత, ప్రాక్టికాలిటీపై దృష్టి సారించాయి.
కమర్షియల్ యూజర్లకు స్మార్ట్ ఎంపిక.. iMAXX టెలిమాటిక్స్‌తో Mahindra Bolero Camper అప్డేట్..!
Also Read
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
అప్డేటెడ్ బొలెరో పిక్-అప్‌లో ముందుగా గమనించదగిన మార్పు కొత్త ఫ్రంట్ డిజైన్. ఇది వాహనానికి మరింత ఫ్రెష్, మోడర్న్ లుక్‌ను అందిస్తోంది. వీటితోపాటు డ్రైవర్ సౌకర్యాన్ని పెంచేందుకు రిక్లైనర్ డ్రైవర్ సీట్ (హెడ్‌రెస్ట్ కలిపి)ను అందించారు. అలాగే, వెడల్పైన కో-డ్రైవర్ సీట్‌ను కూడా అందించండం వల్ల దురా ప్రయాణాల్లో అలసట తగ్గేలా డిజైన్ చేశారు. ఈసారి ఇందులో కీలకమైన అప్గ్రేడ్ గా ఎయిర్ కండిషనింగ్ (AC), హీటింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. దీని వల్ల వేసవిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం లభిస్తూ అన్ని వాతావరణ పరిస్థితుల్లో వాహనాన్ని సౌకర్యవంతంగా నడపవచ్చు. కమర్షియల్ యూజర్లకు ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్.
బండి పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ బలమైన పనితీరు, దీర్ఘకాలిక నమ్మకత్వంతో కొనసాగుతుంది. భారత మార్కెట్లో ఇది 2WD, 4WD ఆప్షన్లలో అందుబాటులో ఉండటం వల్ల, వివిధ రకాల వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ధరల పరంగా కూడా మహీంద్రా బొలెరో పిక్-అప్‌ను కమర్షియల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఈ వాహనం ధరలు రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 9.99 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్). మొత్తంగా తాజా అప్‌డేట్స్‌తో మహీంద్రా బొలెరో పిక్-అప్ ఇప్పుడు మరింత కంఫర్టబుల్, అన్ని వాతావరణాలకు సరిపోయే కమర్షియల్ వాహనంగా మారింది.
తాజావార్తలు
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!