దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న పార్టీ బీఆర్ఎస్.. మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ.. తెలంగాణను దోచుకుంటున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ.. ఇలాంటి పార్టీని వచ్చే ఎన్నికల్లో మనం ఓడించాల్సిన అవసరం ఉందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ.. అనేక మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు, పక్క గృహాలను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ కేన్సర్ లాంటోడు... మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు అని విమర్శించాడు.
స్కూళ్ల సమయాన్ని పొడిగించొద్దని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ఇళ్లలోనే చూడాలని చెప్పింది. ఎవరైనా చూడలేకపోతే ఎల్లుండి స్కూళ్లలో చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు.
బీసీలకు అన్యాయం జరుగుతుంటే చూస్తు.. ఊరుకునే ప్రసక్తి లేదని ఆర్. కృష్ణయ్య అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీలకు మరిన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీసీలు.. బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.