Supreme Court: ఏపీ విభజన బిల్లు చట్టబద్దంగా పార్లమెంట్ లో ఆమోదం పొందలేదన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్ ఈ కేసును విచారణ జరిపారు.. అయితే, ఇది రాజకీయ సమస్య కదా..? మేమెందుకు జోక్యం చేసుకోవాలి ? అని ప్రశ్నించారు. ఈ కేసులో ఇంకేముంది విషయం..? అని ప్రశ్నించిన సుప్రీం.. ఇది పార్లమెంటుకు సంబంధించిన విషయంఅని పేర్కొంది.. ఇక, ఇలాంటి రాజ్యాంగ పరమైన కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.. అందుకే ఈ కేసులోపలికి వెళ్లడం లేదని తెలిపింది. కేసు విచారణ వాయిదా వేస్తున్నాం.. అప్పటివరకు వేచి చూడండి అని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు..
Read Also: Kabaddi Tournament: కబడ్డీ మ్యాచ్‌లో కొట్టుకున్న రెండు వర్గాలు..కత్తులు, తుపాకీలతో దాడి
మరోవైపు.. ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వాదనలు వినిపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ఆయన.. పార్లమెంటు తలుపులు మూశారు.. లోక్‌సభ లైవ్ కట్ చేశారు.. ఎలాంటి ఓట్ల లెక్కింపు జరగలేదన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ఎంపీని అయిన నన్ను కూడా సభ నుంచి బయటికి పంపారని తెలిపారు.. ఎనిమిది గంటల పాటు చర్చించాల్సిన బిల్లును అరగంటలోనే తేల్చేశారని సుప్రీంకోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్‌లో ప్రధాని ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు అంటూ వాపోయారు ఉండవల్లి అరుణ్ కుమార్.