కేసీఆర్ వల్లే తెలంగాణ రాజకీయాలు డబ్బు చుట్టు తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారు అని ఆయన విమర్శించారు. వందల కోట్లు ఖర్చు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యనించారు. అందు కోసమే తిరిగి వారికే కేసీఆర్ టికెట్లు ఇచ్చారు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Read Also: Raashi Khanna : హాట్ క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన రాశీ ఖన్నా..
ఎమ్మెల్యేలు, మంత్రుల భూమి ఉన్న చోటే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, స్టేడియంలు కట్టారు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు.. కేసీఆర్, బీసీలకు అన్యాయం చేసిండు.. రాష్ట్రంలో 54,55 శాతం ఉన్నా.. బీసీలకు కేవలం 23 సీట్లు ఇచ్చారు.. అన్ని వర్గాలను వంచించే విధంగా బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వుంది అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Read Also: Jupalli Krishna Rao: మీరు.. తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు..
బీఆర్ఎస్ నేతల బాగోతం ఎంటో అందరికి తెలుసు.. హరీష్ రావు రబ్బరు చెప్పుల కథ వాళ్ళ నేత మైనంపల్లి హన్మంత్ రావు చెప్పిండు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. లక్ష కోట్ల ఎట్లా వచ్చాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో మరోసారి దోపిడీ దొంగలను గెలిపించొద్దు అని ఆయన కోరారు. మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రాష్ట్రం మొత్తం ఆగమైపోతుందని ఆయన వ్యాఖ్యనించారు.