తెలంగాణ రాష్ట్రములో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ చేయడానికి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జునా ఖర్గే 26వ తారీఖున వస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం హామీ ఇచ్చినా.. ఏ ఒక్క పథకానికి కూడా కట్టుబడి లేదు అని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ ఠాక్రే అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలపై, మోసపూరిత పాలనపై పోరాటం చేస్తున్న బీజేపీ శ్రేణులపై దాడులకు, లాఠీచార్జ్ లకు పాల్పడుతూ అణచివేయాలని చూస్తోంది అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను అణచివేయాలని చూడటం దుర్మార్గ చర్యే అని ఆయన వ్యాఖ్యనించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త తెలియజేసింది.. ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ నోటిఫికేషన్ను ప్రభుత్వం నేడు విడుదల చేసింది.నేడు టీఆర్టీ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5089 ఉపాధ్యాయ పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీనిని డీఎస్సీ ద్వారా విడుదల చేస్తున్నామని విద్యా శాఖ మంత్రి సబిత…
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్ లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది.
స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్వాగత ర్యాలీ కార్యక్రమంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనాపూర్ ప్రజల రుణం తీర్చుకోలేను అని అన్నారు.
కేసీఆర్ కి 10 ఏళ్లు అధికారం ఇచ్చాము ఇంకా చాలు.. ప్రజల కష్టాలు పోవాలంటే కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఈ దుష్టంతాలను బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి అని ఆయన తెలిపారు.
తెలంగాణలో రైతుల కళ్లలో సీఎం కేసీఆర్ సంతోషం చూస్తున్నారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు సంపూర్ణం అయిందని ఆయన పేర్కొన్నారు. 11వ విడతలో రూ.7624.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయబడ్డాయని తెలిపారు.
మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కల అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారు.. కేసీఆర్ జిల్లా చేసి చూపించారు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణం.. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.