వరంగల్ లో మేనిఫెస్టో ప్రకటిస్తా.. క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తా..
ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ పేర్కొన్నాడు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం చెప్పారు. అలాగే పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేనికి కాకుండా పోతారు.. మాది సన్యాసుల మఠం కాదు.. మాది రాజకీయ పార్టీ.. ఓట్లు కావాలని ఆనుకుంటాం కదా.. మేనిఫెస్టోలో మాక్కూడా వ్యూహం ఉంటది కదా.. ప్రగతి అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు.
కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ ఎందుకు పోటీ చేస్తున్నాడో తెలుసా..?
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్.. హ్యాట్రికి లక్ష్యంగా ఎన్నికలకు కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే, కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, రెండు చోట్ల పోటీ చేయనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వెల్లడించారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. గజ్వేల్ లో ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తానని.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కేసీఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నాడు.
బీఆర్‌ఎస్ అభ్యర్థులు మారిన స్థానాలు ఇవే
అభ్యర్థులు మారిన స్థానాలు: ఉప్పల్-బండారి లక్ష్మారెడ్డి (in), బేతి సుభాష్‌రెడ్డి (Out), ఆసిఫాబాద్ – కోవా లక్ష్మి (in), ఆత్రం సక్కు (out), ఖానాపూర్ – జాన్సన్ (in), రేఖా నాయక్ (out), కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్ (in), విద్యాసాగర్‌రావు (out), వైరా – మదన్‌లాల్ (in), రాములు నాయక్ (out), స్టేషన్ ఘన్‌పూర్ – కడియం శ్రీహరి (in), రాజయ్య (out), వేములవాడ-చల్మెడ లక్ష్మీ నరసింహారావు(in), చెన్నమనేని రమేష్ (out)
నేనేంటో అధిష్టానానికి తెలుసు.. ఎమ్మెల్యే హాట్ కామెంట్లు..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. ఇంకా నోటిఫికేషన్ రాకపోయినా.. అప్పుడే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి కాకరేపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.. అదే సమయంలో.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు నిర్వహిస్తారు.. అయితే, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తా లేకపోతే వ్యాపారాలు చేసుకుంటా అని ప్రకటించారు. గతంలోనే అధిష్టానానికి ఇక్కడ విషయాలు అన్నీ చెప్పాను.. ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన లేదన్న ఆయన.. నేను సౌమ్యంగా ఉందటం ఒక వైపు , రాజీ పడను అది రెండో వైపు అన్నారు. ఇక, భయపెట్టో, మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్ ని లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు మైలవరం ఎమ్మెల్యే.. పదవులు ఇచ్చే వరకు నక్క వినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్ధులు చూపుతున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్లు, ఈ రెండూ లేని ఊళ్లు ఉండవు రాజా! అని వ్యాఖ్యానించారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే నాకు వర్గాలను అంటగడుతున్నారు.. అత్యంత నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేల్లో నేను ఒకడిని అన్నారు. నేనేంటో అధిష్టానానికి తెలుసు.. నేనేంటో కుతంత్రాలు చేసే వాళ్లకు తెలుసు.. ఏదేమైనా సీఎం వైఎస్ జగన్ మాటే ఫైనల్ అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
టీడీపీలో చేరిన యార్లగడ్డ..
ఈ మధ్యే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ప్రవేశించింది.. ఈ నేపథ్యంలో లోకేష్‌తో సమావేశమైన యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు.. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు నారా లోకేష్.. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది..
కన్నకూతురుపై అత్యాచారం, గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన తీర్పు
కన్నకూతురిని అల్లారు ముద్దుగా చూసుకావాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశారు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే ఆ పిల్ల పాలిట పాపాత్ముడిగా మారాడు. ఈ హేయమైన ఘటన విశాఖపట్నం జిల్లా, మల్కాపురం ఎన్టీఆర్ కాలనీలో సంచలనం రేపిన విషయం విదితమే.. మానవసంబంధాలు, వావివరసలు మరిచి.. తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురిపై కొంతకాలం పాటు అత్యాచారం చేశాడు.. అయితే, తీరా ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగు చూసింది.. ఈ కేసులో విశాఖ పోక్సో కోర్టు సంచలనం తీర్పు వెలువరించింది. కన్నకూతురుపై అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఆ కామాంధుడైన తండ్రి రామచంద్రరావుకి జీవిత ఖైదు విధించింది విశాఖ పోక్సో కోర్టు.. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 28 అక్టోబర్ 2020న కేసు నమోదైంది.. 15 ఏళ్ల మైనర్ కూతురుపై అత్యాచారం చేయడంతో.. ఆ బాలికి గర్భం దాల్చడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు బంధువులు.. కేసు నమోదు చేసిన దిశా పోలీసులు.. విచారణ పూర్తి చేశారు.. ఇక, ఈ రోజు విశాఖ పోక్పో కోర్టు రామచంద్ర రావుకి జీవిత కాలం శిక్ష విధించింది.. బాధితురాలికి పది లక్షల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని జడ్జి ఆనంది ఆదేశించారు.. మరోవైపు.. బాధితురాలికి న్యాయం జరగడంతో.. స్పెషల్ పోక్సో కోర్టు పీపీ కరణం కృష్ణకి కన్నీటితో ధన్యవాదాలు తెలిపారు బాధితురాలి కుటుంబ సభ్యులు.
హైదరాబాద్ లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్..
హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన అటోలో ఎక్కించుకున్నాడు. ఆపై పక్కవీధిలోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా బాలుడిపై దాడికి దిగాడు.. ఆ బాలుడికి ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపే ఆటో డ్రైవర్ బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అది గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.. ఆ చుట్టు ఉన్న సీసి టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
స్వామి ప్రసాద్ మౌర్యపై బూటు విసిరిన యువకుడు.. చితకబాదినన కార్యకర్తలు
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అంతేకాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా అడ్డుకులోదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడిని ఆకాష్ సైనీగా గుర్తించారు. యువకుడు లాయర్ వేషంలో వచ్చినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో షూ స్వామి ప్రసాద్ మౌర్య వద్దకు చేరకపోవడంతో తృటిలో బయటపడ్డాడు. స్వామి ప్రసాద్ ఇటీవలి చేసిన వ్యాఖ్యలపై నిందితుడు తీవ్ర అసహనానికి గురయ్యాడని.. ఈ నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. యువకుడి దుశ్చర్యతో కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
బ్యాంక్ లోన్ తీసుకుని రోడ్ల గుంతలు పూడ్చుతున్న ఐటీ ఉద్యోగి.. కారణమేంటంటే..?
అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఏం చక్కా ఆఫీసులో ఏసీ కింద కూర్చుని పనిచేయాల్సిన వ్యక్తి రోడ్లపై గుంతలు పూడ్చుతున్నాడు. అంతేకాకుండా రోడ్డు మరమ్మత్తులకు దాదాపు 2.70 లక్షల రూపాయలను బ్యాంకు నుంచి అప్పు చేసి మరీ చేస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. అసలు విషయమేంటంటే.. బెంగళూరులోని హోసా రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ముద్గల్(32) అనే వ్యక్తి.. తాను ఉండే ప్రదేశంలో రోడ్డు అధ్వాన్నంగా ఉంది. ఆ గుంతల్లో బ్యాలెన్స్ తప్పి ఓ డెలివరీ బాయ్.. తన కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తన కుటుంబాన్ని పోషించడానికి అతన సంపాదనే ఆధారం. ఇదే కాకుండా మరో ఘటన కూడా చోటు చేసుకుంది. గుంతలు భారీగా ఉండటంతో ఓ ఆటో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే పలుమార్లు ముద్గల్ అధికారులకు చెప్పినా ఫలితం లేదు. దీంతో విసిగిపోయిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. గుంతలను పూడ్చేందుకు నిర్ణయించుకున్నాడు.
నేను చస్తే.. నా శవాన్ని కూడా వారికి చూపించొద్దు
ఒక ఇంటర్వ్యూలో పోసాని.. తన చావు గురించి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తాను ఇప్పటికిప్పుడు చనిపోయినా పర్వాలేదని, తన కుటుంబాన్ని అంతా సెటిల్ చేసినట్లు తెలిపాడు. అంతేకాకుండా తాను చనిపోయాక.. తన శవాన్ని కూడా ఇండస్ట్రీ వారికి చూపించకూడదని భార్యకు చెప్పినట్లు చెప్పుకొచ్చాడు. ” నా కుటుంబానికి నేను అంతా సెటిల్ చేసి పెట్టాను. నా భార్యను ముందుగానే ప్రిపేర్ చేసేసా.. చూడమ్మా.. నేను ఎప్పుడు చచ్చిపోయినా ఏడవద్దు. నీ పేరు మీద రూ. 50 కోట్ల ఆస్తి ఉంది. నేను చచ్చిపోయాక నీకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది రాదు. నువ్వు ఏ పని చేయకపోయినా నెలకు రూ. 8 లక్షలు రెంట్ వచ్చేలా ఏర్పాటు చేశా.. ఇంట్లో నలుగురు పనివాళ్లను పెట్టుకో.. నువ్వు ఎక్కడికి వెళ్లినా వాళ్ళను తీసుకెళ్ళు. నేను లేను అనే బాధ నీకు ఉంటుంది. అందుకే ఇలా ఆనలుగురు నీ చుట్టూ ఉండేలా చూసుకో. నేను చనిపోయాక.. నా శవాన్ని కూడా ఇండస్ట్రీలో ఎవరికి చూపించకు. ఏ ఒక్కరు నా చావుకు సానుభూతి పడడం, ఏడవడం చేసినా నాకు నచ్చదు. ముఖ్యంగా నువ్వు కూడా ఏడవద్దు.. అని నా భార్యను ప్రిపేర్ చేసి పెట్టాను.. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోసాని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
అన్నలతో తమ్ముడు.. మిలియన్ డాలర్ పిక్ అంటార్రా బాబు
నందమూరి అనేది ఇంటి పేరు మాత్రమే కాదు. ఇండస్ట్రీకి ఒక పునాది. ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ, నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రం ఇండస్ట్రీ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ఆ నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. వారి కుమారులు కొనసాగిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ.. నందమూరి కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్.. ఇక వచ్చే తరానికి నందమూరి మోక్షజ్ఞ. ఇలా ఒక్కో తరానికి ఒక్కో హీరో వస్తూ నందమూరి పేరును కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కొంతమంది నెగ్గుకు రాలేక వెనక్కి వెళ్లిపోయారు. ఇంకొంతమంది.. తమ తాతగారి పేరును నిలబెడుతున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రథముడు. ఇక చాలా రేర్ గా నందమూరి బ్రదర్స్ ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. బాలకృష్ణ ఉంటే ఎన్టీఆర్ ఉండడు .. కళ్యాణ్ రామ్ ఉంటే మోక్షజ్ఞ ఉండడు. కానీ, మొట్ట మొదటిసారి నందమూరి కుర్రాళ్ళు ఒకేచోట కనిపించారు. నేడు సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె సుహాసిని కొడుకు పెళ్లి జరిగింది. అందులో నందమూరి బ్రదర్స్ ఒకేచోట కనిపించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఎప్పుడు అభిమానులు ఒక్కటిగానే చూస్తూ ఉంటారు. కానీ, ఈసారి ఈ అన్నదమ్ములతో పాటు తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెజో పాటు మోక్షజ్ఞ కలిసి కనిపించడం నందమూరి ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ముగ్గురు ఎంతో హుందాగా, సాంప్రదాయకంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మిలియన్ డాలర్ పిక్ అంటే ఇదే అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక అన్నలిద్దరు సెట్ అయ్యారు.. తమ్ముడు కోసమే ఎదురుచూపులు అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.
పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’..
బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సోహెల్, రూపా కొడవాయుర్ జంటగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సరికొత్త కథతో మేల్ ప్రెగ్నెన్సీ అనే న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. నైజాం ఏరియాలో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రిలీజైంది. మేల్ ప్రెగ్నెన్సీ అనే యూనిక్ కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చూసేందుకు యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో మూవీ రిలీజైన శుక్రవారం నుంచి డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఎమోషన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ ఉన్న ఈ సినిమా కొత్త తరహా మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. మల్టీప్లెక్స్ లతో పాటు బీ, సీ సెంటర్స్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.
విమానం లో ప్రత్యక్షమైన రవితేజ.. ఎక్కిడికి వెళ్తున్నాడంటే..?
రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు. మాస్ మహారాజా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా టైగర్ నాగేశ్వరరావు తో సినిమాతో పాటు ఈగల్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.కొన్ని రోజులుగా టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ తన అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు.1970 కాలంలో స్టూవర్ట్‌పురం లో పాపులర్ దొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ నేపథ్యం లో వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఇటీవలే విడుదల చేసిన టైగర్ నాగేశ్వరరావు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. మాస్ మూవీ ఫ్యాన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌ను ఈ చిత్రం తో అందించబోతున్నట్టు టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అయిన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో హీరోయిన్ కావ్య థాపర్ సినిమాలో కీలక పాత్ర లో పోషిస్తుంది.ఈ సినిమాలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.తాజాగా రవితేజ విమానం లో ఉన్న స్టిల్ ఒకటి నెట్టింట బాగా ట్రెండింగ్ అవుతోంది.. విమానంలోని బిజినెస్ క్లాస్‌లో దిగిన ఫొటో ను ఇన్ స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.లండన్‌కు పయనం అంటూ ఈగల్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టాడు. ఈగల్ సినిమా తరువాత షెడ్యూల్ లండన్ లో జరుగనున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు రవితేజ. ఈ షెడ్యూల్‌లో రెండు వారాలపాటు ముఖ్యమైన సన్నివేశాల ను చిత్రీకరించనున్నారని సమాచారం.