ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. అదే రోజున బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని కేసీఆర్ పేర్కొన్నాడు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం చెప్పారు.
Read Also: Prakash Raj: చంద్రయాన్-3 పై ప్రకాష్ రాజ్ కార్టూన్ ట్వీట్.. మండిపడుతున్న జనాలు
అలాగే పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని సీఎం కేసీఆర్ తెలిపారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణ తప్పితే.. తీసి అవతల పారేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేనికి కాకుండా పోతారు.. మాది సన్యాసుల మఠం కాదు.. మాది రాజకీయ పార్టీ.. ఓట్లు కావాలని ఆనుకుంటాం కదా.. మేనిఫెస్టోలో మాక్కూడా వ్యూహం ఉంటది కదా.. ప్రగతి అజెండాగా ఎన్నికలకు వెళ్తున్నామని కేసీఆర్ అన్నారు.
Read Also: Nandamuri Brothers: అన్నలతో తమ్ముడు.. మిలియన్ డాలర్ పిక్ అంటార్రా బాబు
గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి బరిలో దిగుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గజ్వేల్ సురక్షితమే అని ప్రచారం జరుగుతున్నా.. మరో స్థానం నుంచి కూడా పోటీ చేయాలని పార్టీలో కొందరు ముఖ్య నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. గజ్వేల్ లో ఇప్పటికే కేసీఆర్ పై పోటీ చేస్తానని.. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. అయితే దీనితో సంబంధం లేకుండా.. కేసీఆర్ మరో నియోజకవర్గం కూడా ఎంచుకున్నాడు.