కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘పరాశక్తి’. తమిళ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, అథర్వ, జయం రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
కాగా ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. ఈ చిత్రంలో అతిథి పాత్రలుగా ప్రముఖ నటులను తీసుకోవాలని అనుకున్నప్పుడు మొదట బాలీవుడ్ స్టార్ హీరోని తమిళ్ లో పరిచయం చేయాలనే ఉద్దేశంతో అభిషేక్ బచ్చన్‌ను ఓ చిన్న పాత్ర కోసం సుధా కొంగర స్వయంగా సంప్రదించారట. అదేవిధంగా తెలుగు స్టార్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను తీసుకోవాలని చర్చలు జరిపారట. అయితే విజయ్ అప్పటికే ఇతర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో పరాశక్తి సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక నో చెప్పాడట. దాంతో స్పెషల్ క్యామియోస్ పై సుధా కొంగర చివరకు ఒక కీలక నిర్ణయం తీసుకుందట. అతిథి పాత్రల సంఖ్య ఎక్కువైతే కథలో ఒరిజినాలిటీ తగ్గే అవకాశం ఉందని భావించిందట. ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది గెస్ట్ స్టార్స్‌ను చేర్చకుండా కేవలం బాసిల్, రానా తోనే సరిపెట్టింది. ఇక విజయ్ తీసుకున్న నిర్ణయంతో తమ హీరో మరొక ప్లాప్ నుండి తప్పించుకున్నాడు ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.