కుటుంబ కలహాల వల్లో లేక వేరే కారణాల వల్ల అభం శుభం తెలియని చిన్నపిల్లలపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. నిన్న తనకు దక్కని సంతోషాన్ని భార్యకు కూడా దూరం చేసేందుకు కన్న కొడుకును గొంతు కోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ బాలుడిని ఆటో డ్రైవర్ అతి దారుణంగా గొంతు కోసిన ఘటన వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలుడిని చంపేందుకు ఆటో డ్రైవర్ యత్నించడం కలకలం రేపింది. హకల్పకాలనీలో ఆడుకుంటూ ఉన్న తొమ్మిదేళ్ల బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన అటోలో ఎక్కించుకున్నాడు. ఆపై పక్కవీధిలోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా బాలుడిపై దాడికి దిగాడు..
ఆ బాలుడికి ఏం జరుగుతుందో తెలుసుకొనే లోపే ఆటో డ్రైవర్ బాలుడి గొంతు కోసేశాడు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అది గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘోరానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అయితే ఆటో డ్రైవర్ ఓ సైకోగా పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.. ఆ చుట్టు ఉన్న సీసి టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.. త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..