జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల ముందు నిర్ణయించిన దిశా మీటింగ్కు అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం టెండర్లకు గడువు ముగిసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య లక్ష దాటినట్లు తెలుస్తుంది. అయితే, ఎక్సైజ్ అధికారుల అంచనాకు మించి దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
త్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే రోజు రూ.6 వేల కోట్ల రుణమాఫీ ట్రెజరీ చరిత్రలో రికార్డ్ అని ఆయన అన్నారు. రూ.17 వేల కోట్లు 2018 వరకు మొదటి విడతలో రుణమాఫీ చేశాం.. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. రూ.36 వేల వరకు రైతుల రుణాలను వెంటనే మాఫీ చేశామన్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా జరుపుతుందని ఆయన వెల్లడించారు.
నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల రక్షణ గాలికి వదిలేసి ప్రలోబాలకు గురిచేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి భద్రతను తొలగించడం అప్రజాస్వామ్యకమైన చర్య అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.