Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు బిగ్ అలర్ట్ జారీ చేశారు. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
Fire Accident : నగరంలోని మీర్చౌక్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్‌చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు…
Fire Accident : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు భవనాన్ని చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.…
Telangana Weather : దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం , పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా, మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు అదే ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ స్థితుల ప్రభావంతో రాబోయే మూడు…
Indiramma Houses : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్ , స్టీలు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు, సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్ , స్టీలు ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే…
తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల ఏర్పాటు వ్యవహారం ఎలా ఉందంటే.. వస్తా కూర్చో అని చెప్పి వెళ్ళిపోయినట్టు ఉందంటున్నారు. వెళ్ళిన వాడు తిరిగి రాడు.. కూర్చున్నోడు వెళ్లిపోలేడు. అదిగో ఇదిగో అనడం ఒక ఎత్తైతే.. ఒకరి మీద ఒకరు పితూరీలు చెప్పుకుంటూ.. కొర్రీలు పెట్టుకుంటున్నారట.
గడ్డం వంశీకృష్ణ.. పెద్దపల్లి ఎంపీ. 35 ఏళ్లకే లోక్‌సభలో అడుగుపెట్టారీ పొలిటికల్ వారసుడు. కాకా కుటుంబం నుంచి పెద్దపల్లి సీట్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మూడో తరం నాయకుడు. అంతవరకు బాగానే ఉందిగానీ.. ఇప్పుడాయన వ్యవహారశైలి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. అటు పార్టీ కార్యక్రమాల్లో, ఇటు ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌లో ప్రోటోకాల్ ప్రకారం పిలుపులు ఉండటం లేదన్నది ఎంపీ అనుచరుల ఆరోపణ. ఐడెంటిటీ సమస్య కావడంతో ఆగ్రహంతో ఉన్నారట ఎంపీసాబ్.
దొరకి ఏం ఆలోచన వచ్చిందో కానీ అర్ధరాత్రి వీఆర్ఏ, వీఆర్వో వ్యవస్థను తీసేశారు అని పేర్కొన్నారు. మళ్ళీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.
MP DK Aruna: పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. బీజేపీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ దేశం మిగలదని మన సైనికులు సంకేతం ఇచ్చారు.. ఉగ్రవాదులను, దుండగులను ఐక్యతతో అంతం చేస్తామని తేల్చి చెప్పారు.