KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలపై తొలిసారి విచారణను ఎదుర్కోబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ ఈ రోజు (జూన్ 11న) నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటలలోపు బీఆర్కే భవన్ కి ఆయన చేరుకోనున్నారు. కాగా, ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కి కేసీఆర్ బయల్దేరి రానున్నారు.
Read Also: Coolie : తెలుగు రాష్ట్రాల్లో ‘కూలీ’ రైట్స్ కోసం భారీ డిమాండ్..!
కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న పలువురు ఇంజినీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేసింది. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ ను విచారణకు పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ఏయే ప్రశ్నలు వేస్తుంది? దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది? ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. అయితే, ఇప్పటికే, ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను సైతం కమిషన్ ఎంక్వైరీ చేసింది.