Kaleshwaram Project Case: ఒకపక్క కాళేశ్వరం కమిషన్ విచారణ.. మాజీ ముఖ్యమంత్రిని పిలిచి విచారణ జరుగుతుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ ఓ వైపు నెలకొంది.. మరోవైపు ఏసీబీ అధికారులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.. మొన్నటికి మొన్న కాలేశ్వరం ఈఎంసీగా పనిచేసిన హరి రామ్ పై సోదాలు నిర్వహించి వందల కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీన పరుచుకున్నారు.. ఆ దాడి నుంచి ఇంకా కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు మర్చిపోకముందే తాజాగా మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు.. కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయం అయిందని ఇప్పటికే ప్రభుత్వం బహిరంగంగానే చెప్తుంది.. అందులో పని చేసిన అధికారులు కోట్ల రూపాయలు అక్రమ ఆస్తులను సంపాదించారని ఏసీబీ కూడా చెప్పింది.. కమిషన్ విచారణలో ఈ విషయం బహిర్గతమైంది.. ఇందులో 33 మంది అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఇప్పటికే రిపోర్ట్ చేసింది..
Read Also: Jyoti Malhotra: ‘గూఢచారి’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బెయిల్ తిరస్కరణ..
మరోవైపు ఏడు మంది ఈఎన్సీ స్థాయి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశాలు ఇచ్చింది.. కమిషన్ ఓ పక్క విచారణ చేస్తున్న తరుణంలోనే తాజాగా ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఒకపక్క మాజీ సీఎం కేసీఆర్ ని కమిషన్ పిలిచి విచారిస్తుంది. ఈ తరుణంలోని ఇవాళ ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలను ప్రారంభించింది.. కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ ఆర్ ఎస్ పి కింద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూనె శ్రీధర్ ఇంటిపైన ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు.. శ్రీధర్ కు సంబంధించిన 20 చోట్ల సోదాలను ఏకకాలంలో ప్రారంభించారు.. హైదరాబాద్, బెంగళూరు, కరీంనగర్, వరంగల్ లో ఈ సోదాలను ప్రారంభించారు ఈ సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువ చేసే స్థిర ఆస్తులను అధికారులు స్వాధీనపరుచుకున్నారు చాలా వరకు నూనె శ్రీధర్ కు సంబంధించి పలు హోటల్లో కూడా షేర్లు పెట్టినట్లు అధికారులు తీర్చారు.
Read Also: Kaleshwaram Project: రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవు.. ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం: పొంగులేటి
ఎస్ఆర్ఎస్ పి కాళేశ్వరం ప్రాజెక్టు 8లో లక్ష్మీ పంపు నిర్వహణ బాధ్యతలను నూనె శ్రీధర్ చూస్తున్నారు. ఇతని ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున పంపుల బిగింపు.. సొరంగం లాంటి పనులు పూర్తి చేశారు.. ఆ సందర్భంలో వందల కోట్ల రూపాయల ఆస్తులను శ్రీధర్ సంపాదించినట్లు అధికారులు తేల్చారు.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు నూనె శ్రీధర్ ఇంటిపైన ఇవాళ ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలను ప్రారంభించారు.. ఆస్తులకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ఇప్పటికే బహిర్గతం అవుతున్నాయి.. నూనె శ్రీధర్ కు సంబంధించి హైదరాబాద్‌లో పలు కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు సంబంధించిన పత్రాలను స్వాధీనం పంచుకున్నారు.. దేనికి తోడు వరంగల్‌లో కమర్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్లను కూడా గుర్తించారు.. మరోవైపు కరీంనగర్‌లో పలు హోటలలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు.. అంతేకాకుండా కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున వ్యవసాయ భూములతో పాటు అపార్ట్మెంట్లు, ఇళ్లకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. బెంగళూరులో కూడా పెద్ద ఎత్తున కమర్షియల్ కాంప్లెక్స్ లు, అపార్ట్మెంట్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ జరుగుతున్న సోదరులు మునుముందు ఏం తేలుతుందో చూడాల్సిన అవసరం ఉంది..