దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని…
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పడం లేదు. ఇటీవల మెట్రో ఛార్జీల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెంచిన ఛార్జీలు మే 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నేటి నుంచి పెరిగిన మెట్రో ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. Also Read:IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునః ప్రారంభం.. ఆర్సీబీ,…
ఇవాళ కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన.. సీ క్యాంప్ రైతు బజార్లో రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడనున్న సీఎం నేడు కాకినాడ టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల సమావేశం.. మినీ మహానాడు నిర్వహణపై చర్చించనున్న నేతలు మంత్రాలయం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నేడు స్వామి వారికి తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషేకం వంటి ప్రత్యేక పూజలు.. సాయంత్రం స్వామి వారిని రథంపై ఊరేగింపు నేడు గుంటూరు జిల్లా బొంగరాలబీడు స్మశానవాటికలో ఎలక్ట్రికల్ క్రెమోషన్…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు... ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమా హాట్ హాట్గా మారుతోంది. అదీకూడా.. ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతుండటం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీమ్ అని కాంగ్రెస్ అంటే.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది.
IT Company Fraud: హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో బోర్డు తిప్పేసిన కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ప్యూరోపాల్ క్రియేషన్స్ అండ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు.. అయితే, కనీసం ఆఫీస్ కూడా ఏర్పాటు చేయకుండానే.. నిరుద్యోగులకు కేటుగాళ్లు ఎర వేశారు.
క్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణి వైఖరితో కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
అధిక తూకం లేకుండా, ధాన్యం తరలింపుకు రవాణా ఇబ్బందులు రాకుండా.. చర్యలు తీసుకోవడంతో పాటు పేమెంట్ ఆలస్యం కాకుండా వెంట వెంటనే రైతుల ఖాతాల్లో పడేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.