DSLR లాంటి ఫోటోగ్రఫీ ఇచ్చే టాప్ 200MP Camera స్మార్ట్‌ఫోన్లు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
200MP Camera Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తుంటాము. ఇందులో ప్రస్తుతం కొందరు కెమెరాల ఫీచర్స్ ను ఎంచుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. దీనితో స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ఓ కొత్త పోటీ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. ఒకప్పుడు ప్రొఫెషనల్ కెమెరాలకు మాత్రమే పరిమితమైన హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీ, ఇప్పుడు 200MP కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లలోనే అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ప్రీమియం ఫోన్ లో లభించే మంచి కెమెరా.. ఇప్పుడు మిడ్-రేంజ్ ధరలోనే అనేక బ్రాండ్లు 200MP సెన్సార్‌లతో ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మీరు మీరు కూడా కొత్తగా కెమెరా ఫోకస్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఈ ఫోన్లను తప్పక లిస్ట్ లో చేర్చుకోండి.
రెడ్ మీ నోట్ 15 ప్రో 5G (Redmi Note 15 Pro 5G):
బడ్జెట్ లో బెస్ట్ 200MP కెమెరా ఫోన్ కావాలంటే ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్‌లో OIS సపోర్ట్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా ఉంది. అంతేకాకుండా 8MP అల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఇది లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం మరో విశేషం. ముందు వైపు 20MP ఫ్రంట్ కెమెరా డైలీ యూజ్, సోషల్ మీడియా కోసం సరిపోయేలా ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.30,000 వద్ద ఉంది.
Also Read
- TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
Biker Glimpse: అదిరిపోయిన శర్వానంద్ ‘బైకర్’ గ్లింప్స్.. ‘బుల్లెట్ సునీల్’గా రాజశేఖర్ మాస్ ఎంట్రీ..
Vivo V60e (vivo V60e):
తక్కువ ధరలో వివో బ్రాండ్ నుంచి 200MP కెమెరా ఫోన్ కావాలనుకునే వారికి వివో V60e మంచి ఆప్షన్. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. AI ఆధారిత ఇమేజ్ ఫీచర్లు, 30x సూపర్ జూమ్, మెరుగైన 4K వీడియో అవుట్‌పుట్‌ను కంపెనీ అందిస్తోంది. ముందు వైపు 50MP ఐ ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వ్లాగింగ్‌కు చాలా ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ 256GB వేరియంట్ ధర రూ.33,999గా ఉంది.
వివో X300 (Vivo X300):
ప్రీమియం కెమెరా అనుభవం కావాలంటే వివో X300 ఓ బెస్ట్ ఎంపిక. ఎందుకంటే ఇది ZEISS ఆప్టిక్స్‌తో కూడిన 200MP మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఇందులో ఉన్నాయి. దీనితో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ లెన్స్‌లు ఇచ్చారు. లేజర్ ఆటోఫోకస్, 4K వీడియో రికార్డింగ్ ఫీచర్లు దీనిని ఆల్‌రౌండ్ కెమెరా ఫోన్‌గా నిలబెడతాయి. ఇంకా 50MP ఫ్రంట్ కెమెరా హై డీటెయిల్ సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. అయితే దీని ధర రూ.75,999. ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది.
శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra):
ప్రీమియం సెగ్మెంట్‌లో కెమెరా పవర్‌హౌస్ గా గుర్తింపు పొందిన స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా. ఇందులో OISతో కూడిన 200MP మెయిన్ సెన్సార్ ఉంది. దీన్ని 50MP అల్ట్రా వైడ్ కెమెరా, రెండు టెలిఫోటో లెన్స్‌లు సపోర్ట్ చేస్తాయి. 3x, 5x ఆప్టికల్ జూమ్‌తో దూరంలోని ఆబ్జెక్ట్స్‌ను కూడా క్లియర్‌గా క్యాప్చర్ చేయవచ్చు. 8K వీడియో రికార్డింగ్, అడ్వాన్స్‌డ్ స్టెబిలైజేషన్ వల్ల కంటెంట్ క్రియేటర్లకు ఇది బెస్ట్ ఆప్షన్. ముందు వైపు 12MP కెమెరా మాత్రమే ఉంది. భారత మార్కెట్లో దీని ధర సుమారు రూ.1,29,999.
రియల్ మీ 16 ప్రో 5G (Realme 16 Pro 5G):
మిడ్ రేంజ్‌లో పవర్‌ఫుల్ కెమెరా ఫోన్ కావాలంటే రియల్ మీ 16 ప్రో 5G కూడా ఓ మంచి ఎంపిక. ఇందులో OIS సపోర్ట్‌తో 200MP మెయిన్ కెమెరా లభిస్తుంది. ఇంకా 50MP ఫ్రంట్ కెమెరా వల్ల హై డీటెయిల్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఇందులో 6.78 ఇంచ్ 144Hz 1.5K AMOLED డిస్ప్లే, డిమెంసిటీ 7300-మాక్స్ చిప్‌సెట్, 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు దీనిని పవర్ యూజర్లకు ప్రత్యేకంగా నిలబెడతాయి. దీని ధర రూ.31,999 గా ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..