Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 5 Pm 11th June 2025

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :June 11, 2025 , 5:13 pm
By Sudhakar Ravula
Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇకనైనా స్పందించండి.. ప్రభుత్వానికి జగన్‌ వార్నింగ్‌
ఇకనైనా రైతుల సమస్యలపై స్పందించకపోతే, పంటల కొనుగోలుకు శ్రీకారం చుట్టకపోతే.. ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఇప్పటికైనా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి పోటీతత్వం పెంచి.. ప్రతి రైతుకు కనీసం యావరేజ్‌ ప్రైజ్‌ వచ్చేలా చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా పోరాటం ఉధృతం అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు.. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, అక్కడ పొగాకు రైతుల సమస్యలు ఆరా తీశారు. కనీస గిట్టుబాటు ధర కూడా రాక, సరుకు కొనేవారూ లేక పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న జగన్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు రైతులు పడుతున్న అవస్థలు ఎలా ఉన్నాయంటే.. రైతులను ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదన్ని ఆరోపించారు జగన్‌.. దీంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సీజన్‌ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ రైతులకు చెల్లించారు. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. అదే ఏడాది క్రితం వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు, రైతు పరిస్థితి ఎలా ఉండేది? ఒక్క సంవత్సరంలో అది ఏ విధంగా దిగజారింది అని చెప్పడానికి నిదర్శనం జిల్లాలో జరిగిన రైతుల ఆత్మహత్యలే అని పేర్కొన్నారు.

భూమా అఖిల ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు ఎవరు దూరం అయ్యారు..!
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆళ్లగడ్డలో నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. రూ. 25 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు.. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న కూటమి ప్రభత్వాన్ని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.. ఇక, కళ్లు తిరిగి పడిపోయి నేను హాస్పిటల్ లో ఉంటే.. నన్ను చూడటానికి ఎవరు వచ్చారు..? ఎవరు రాలేదంటూ..? వార్తలు రాస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఉదయం లేస్తే నేనేం చేస్తున్నాను..? నాకు ఎవరు దూరం అయ్యారు…? ఇలా కల్పితాలని రాయడం పక్కనపెట్టి.. మేం ప్రజలకు చేస్తున్న సేవలు రాయండి అంటూ సలహాఇచ్చారు.. మరోవైపు, అహోబిలం అభివృద్ధికి కేంద్రం రూ. 25 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..

తల్లికి వందనంపై గుడ్‌న్యూస్‌ చెప్పిన మంత్రి లోకేష్‌
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ.. అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళామణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం అన్నారు.. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు.. తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.. ఇక, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకం అందుతుందని స్పష్టం చేశారు నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు.. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు మొదలు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థుల వరకు అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. మరోవైపు, సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన మా కూటమి ప్రభుత్వం, తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందని వెల్లడించారు మంత్రి నారా లోకేష్‌..

తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి.. అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ!
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి అంగన్వాడీ కేంద్రాలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు ఎంజాయ్ చేసిన చిన్నారులు నేడు అంగన్వాడీ కేంద్రాల బాట పట్టారు. మొదటి రోజు కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్లు కలిసి చిన్నారులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (డాక్టర్ ధనసరి అనసూయ) ఆదేశాల మేరకు మొదటి రోజు లంచ్‌లో ఎగ్ బిర్యానీని అంగన్వాడీ సిబ్బంది చిన్నారులకు వడ్డించింది. ఎగ్ బిర్యానీని చిన్నారులు ఎంజాయ్ చేశారు. తెలంగాణ చరిత్రలోనే మొదటిసారిగా అంగన్వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పెట్టారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు ఒకే రకమైన భోజనం కాకుండా మెనూలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. సాధ్యమైన చోట, వీలున్నప్పుడల్లా చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో మొదటి రోజు ఎగ్ బిర్యానీని చిన్నారులకు పెట్టారు. అంగన్వాడీలో చిన్నారుల అడ్మిషన్లను, అటెండెన్స్‌ను పెంచడానికి పిల్లల టేస్టుకు అనుగుణంగా ఆహారం వడ్డించాలని నిర్ణయం తీసుకున్నారు. మంచి ఫుడ్ పెట్టడం ద్వారా చిన్నారులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఆట వస్తువులతో పాటు నాణ్యమైన విద్య బోధన, ఆటలు, పోషకాహారం, ఎగ్ బిర్యానీ వంటి వెరైటీ ఫుడ్ సర్వ్ చేయటం ద్వారా చిన్నారులు, తల్లిదండ్రుల్లో అంగన్వాడీల పట్ల నమ్మకం పెరుగుతోందన్న భావనలో ప్రభుత్వం ఉంది.

ఎంతటి ప్రముఖులైనా వదలం.. మంగ్లీ ఇష్యూపై పోలీసుల సీరియస్ వార్నింగ్!
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్ పై చేవెళ్ల పోలీసులు దాడి చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యతిరేకంగా వ్యవహరిస్తామంటే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎంతటి ప్రముఖులైనా, ఎవరు ఎంతటివారైనా, చట్టాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని వాడే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టిపరిస్థితుల్లో వెనుకాడం అంటూ సోషల్ మీడియాలో ప్రకటించారు. శివారు ప్రాంతాల్లో క్లబ్బులుగా మారిన రిసార్టులలో అశ్లీల నృత్యాలు, విదేశీ మద్యం సరఫరా మీద పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. తాజాగా చేవెళ్ల త్రిపుర రిసార్టులో మంగ్లీ పుట్టిన రోజు వేడుకలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ అంశంలో మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఈవెంట్ నిర్వహించడం, పర్మిషన్ లేకుండా మద్యం వాడకంపై కేసులు నమోదయ్యాయి.

భర్తని చంపేందుకు ప్లాన్-బీ రెడీ చేసిన సోనమ్.. మేఘాలయ కేసులో సంచలనం..
సంచలనంగా మారిన మేఘాలయ హనీమూర్ మర్డర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారుణంగా హత్య చేయించింది. పెళ్లయి నెల రోజులు గడవక ముందే హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకువెళ్లి కిరాయి హంతకులతో హతమార్చింది. మే 23 నుంచి కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 02న మేఘాలయలోని కాసీ హిల్స్‌లో దొరికింది. పోలీసులు రాజాది హత్యగా తేల్చారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులు సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహా కాగా, ముగ్గురు హంతకులు- విశాల్, ఆనంద్, ఆకాష్‌లు హత్యకు పాల్పడ్డారు. భార్య సోనమ్ ముందు, రాజా రఘువంశీని ముగ్గురు హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని లోయలో పారేసేందుకు సోనమ్ నిందితులకు సాయం చేసినట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత, అక్కడ నుంచి పరారైన సోనమ్, జూన్ 08న ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది.

“సిద్ధూ మూసే వాలా” హత్యకు కారణాలు వెల్లడించిన గ్యాంగ్‌స్టర్..
ఫేమస్ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలాను రెండేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ముఠా హతమార్చింది. 2022 మేలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని సొంతూరులో తన ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో, అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో మూసే వాలా అక్కడిక్కడే మరణించాడు. ఆయన ప్రయానిస్తున్న కారుపైకి 100 కన్నా ఎక్కువ బుల్లెట్లు ఫైర్ చేశారు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఈ హత్య గురించి గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ మాట్లాడారు. గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ జిత్ సింగ్. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. ‘‘తన అహంకారంతో అతను [మూస్ వాలా] క్షమించలేని కొన్ని తప్పులు చేసాడు’’ అని బ్రార్ చెప్పాడు. ‘‘అతడిని చంపడం తప్ప మాకు వేరే మార్గం లేదు. అతను తన చర్యలకు పరిణామాలు చెల్లించుకోవాల్సి వచ్చింది’’

“సిందూర్” దాడుల్ని పరదాలతో కప్పుతున్న పాకిస్తాన్..
ఆపరేషన్ సిందూర్ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. ముందుగా, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. అయితే, దీని తర్వాత పాక్ సైన్యం, భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేసింది. ఈ సారి భారత్ పాకిస్తాన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. మొత్తం 11 పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, ఈ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు పాకిస్తాన్ దాడులతో దెబ్బతిన్న ప్రాంతాలను టార్పలిన్ కవర్లతో కప్పుతోంది. మురిద్, జకోబాబాద్, భోలారి ఎయిర్‌బేస్‌లో దెబ్బతిన్న ప్రాంతాను టార్పిలిన్లలో కప్పిన దృశ్యాలు శాటిలైట్ ఇమేజ్‌లలో కనిపించాయి. సింధ్‌లోని భోలారి ఎయిర్ బేస్‌లో దెబ్బతిన్న హ్యాంగర్‌ని కప్పినట్లు శాటిలైట్ ఫోటోలు చూపించాయి. ఈ ఫోటోలను ముందుగా జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ గుర్తించారు. మురిద్ ఎయిర్ బేస్ వద్ద క్షిపణి దాడితో ఏర్పడిన 3 మీటర్ల వెడల్పు కలిగిన బిలాన్ని కాన్వాస్‌తో కప్పి ఉంచారు.

మంగ్లీ కేసు FIR కాపీ.. కీలక విషయాలు వెలుగులోకి!!
మంగ్లీ FIR కాపీలో కీలక విషయాలు ప్రస్తావించారు పోలీసులు.. రాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో రిసార్ట్ పై ఫిర్యాదు వచ్చింది, రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ హంగామా చేస్తున్నారని, రిసార్ట్లో పెద్ద ఎత్తున డీజే పెట్టారంటూ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేశారు స్థానికులు. స్థానికుల ఫిర్యాదుతో త్రిపుర రిసార్ట్ కి వెళ్ళిన మహిళా ఎస్సై పదిమంది మహిళలు 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్లు గుర్తించారు. అందరూ కూడా మద్యం మత్తులో ఉండి డాన్సులు చేస్తున్నట్లు గుర్తించారు. సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు, బర్త్డే పార్టీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని అక్కడ ఉన్న మేనేజర్ చెప్పాడు. పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ నుంచి లిక్కర్ పర్మిషన్ తీసుకున్నట్లు కూడా లేదని గుర్తించారు. వెంటనే బర్త్డే పార్టీ చేసుకుంటున్న మంగ్లీని విచారించారు. ఆమె బర్త్డే పార్టీ అనుమతి లిక్కర్ అనుమతి డీజే అనుమతి లేదని చెప్పారు. డీజేను ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్ చేస్తున్నట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న పురుషులు, మహిళలు అందరికీ డ్రగ్ కిట్టు ద్వారా డ్రగ్ టెస్ట్ నిర్వహించగా ఒక్కరు గంజాయి తీసుకున్నట్లు తేలింది.

నేనే తప్పూ చేయలేదు.. దయచేసి నా ఫోటోలు వాడకండి.. దివి విజ్ఞప్తి!
మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంలో బిగ్ బాస్ దివి కూడా ఇరుక్కుంది. పోలీసులకు ఆమె సహకరించకుండా దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసులు వెల్లడించడంతో ఆమె మీద మీడియా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేసింది. మీడియా మిత్రులకు చిన్న రిక్వెస్ట్ , ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళితే మనం అక్కడ ఏం జరిగితే ఆ తప్పులు అన్నీ మన మీద తోయడం కాదు కదండీ. మీరు కూడా ఒకసారి చుడండి. చూసి దాన్ని బట్టి నిజంగా ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నేను ఏదైనా మిస్టేక్ చేసానని ప్రూవ్ అయితే నా ఫోటో వేస్తే బాగుంటుంది. కానీ ఎలాంటి ప్రూఫ్ లు లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేస్తే ఇలా నెగటివ్ గా చేస్తే నా కెరీర్ కి ఎంత ఇబ్బంది. నేను ఎంతో కష్టోపడి ఈస్థాయికి అచ్చాను. ఎవరైనా ఫ్రెండ్ అంటే పార్టీకి పిలిస్తే వెళ్లాను. ఆమె మంచిదే కదా, అందుకే వెళ్లాను. నేను బర్త్ డే పార్టీకి వెళితే అక్కడ తప్పులు నామీద వేయడం ఎంతవరకు కరెక్ట్? దయచేసి నా ఫోటోలు వాడకండి, నాకు ఇబ్బంది అవుతుంది అని దివి చెప్పుకొచ్చింది.

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివి
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ నిర్వహించిన మంగ్లీ ,పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ కు లిక్కర్ సరఫరా చేయించింది. ఇక స్థానికుల సమాచారంతో రిసార్ట్ పై దాడి చేసిన చేవెళ్ల, ఎస్ఓటీ పోలీసులు పార్టీకి అటెండ్ అయిన ఓ వ్యక్తికి గంజాయి పాజిటివ్ నిర్ధారించారు. రైడ్ చేసే సమయంలో రిసార్ట్ లో మంగ్లీ కి చెందిన 50 మంది సన్నిహితులు ఉండగా 48 మందికి డ్రగ్స్ టెస్ట్ చేశారు పోలీసులు. ఇక టెస్ట్ సమయంలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు కొందరు పార్టీలో పాల్గొన్న వారు. డ్రగ్ పరీక్షల సమయంలో పోలీసులతో రాష్ గా బిహేవ్ చేసింది మంగ్లీ స్నేహితురాలు దివి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cinema
  • india
  • international
  • national

తాజావార్తలు

  • KTR: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత‌ వ్యాఖ్యలు.. కేటీఆర్పై కేసు నమోదు..

  • King Charles: కింగ్ చార్లెస్ కీలక నిర్ణయం.. ఎయిరిండియా మృతులకు నిమిషం మౌనం పాటించనున్న చార్లెస్

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Hyderabad: మాదాపూర్‌, గచ్చిబౌలిలోని పబ్‌లలో పోలీసుల సోదాలు.. నలుగురు అరెస్ట్

  • Israel Strikes: ఇరాన్‌పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions