JD Chakravarthi: బూతు పాటలతో సినిమా ప్రమోషన్.. ‘ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నా’: జేడీ చక్రవర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JD Chakravarthi: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్లు రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఆ ప్రమోషన్లు సభ్యతా సరిహద్దులను కూడా దాటేస్తుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నాయి. తాజాగా నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రమోషన్ ఈవెంట్‌లో జరిగిన ఒక ఘటన ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆ ఈవెంట్‌లో బూతు పాట పాడటంపై ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈవెంట్‌లో బూతు పాట పాడటంపై ‘షాక్ అయ్యాను.. ఈవెంట్ వదిలి వెళ్లిపోదామనుకున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రమోషన్ ఈవెంట్‌లో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.
READ ALSO: Turkish Airlines: విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్!
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ప్రచారం కోసం కొత్తదనం సృష్టించాలి, ప్రేక్షకుల వరకు చేరువ కావాలి. కానీ అందుకు అసభ్యతా మార్గాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రచారం కోసం ‘అర్ధనగ్నంగా ఉండటం, బూతు మాటలు మాట్లాడటం.. లాంటివి ఎందుకు?’ అంటూ ఆయన ప్రశ్నించారు. ఈవెంట్‌లో బూతు పాట పాడటం చూసి షాక్‌కు గురయ్యాను, ఇలాంటి ప్రమోషన్లతో సినిమాలు ఆడవు అంటూ చెప్పారు. మంచి ప్రమోషన్ ఎలా ఉండాలో ఉదాహరణలు కూడా ఇచ్చారు. బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియట్స్’ ప్రమోషన్‌ను ప్రస్తావిస్తూ ఆ సినిమా ప్రచారంలో కొత్తదనం ఉంది. అమీర్ ఖాన్ లాంటి స్టార్‌లు ఇన్నోవేటివ్ స్టంట్లు చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. ఆ టైంలో అమీర్ చేసిన ఇన్నోవేటివ్ స్టంట్లలో పోలీసులు, మీడియా.. అంతా ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అందులో ఎక్కడ అసభ్యత లేదు అని వివరించారు. ఆ రకమైన సృజనాత్మకతే సినిమా ఇండస్ట్రీకి అవసరమని ఆయన సూచించారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సినిమా ప్రమోషన్లలో అసభ్యతా ట్రెండ్ పెరిగిపోతోంది. కానీ జేడీ చక్రవర్తి లాంటి నటులు ఇలాంటి విషయాలపై గళం విప్పడం ఇండస్ట్రీకి మేలు చేస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘ప్రమోషన్ అంటే కేవలం సంచలనమే కాదు.. సభ్యతా, సృజనాత్మకతా ఉండాలి’ సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా ఉండాలంటే, నిర్మాతలు, డైరెక్టర్లు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
READ ALSO: Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!