Minister Uttam: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు పెను ప్రమాదం తప్పింది. వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్టు తెలిసింది.
కేసీఆర్కు నోటీసులపై కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలను గాలికి వదిలి నోటీస్ లు ఇస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని అన్నారు. ప్రజాపాలన కాస్త కమీషన్ల పాలనగా మారిందన్నారు. చట్టాల మీద విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులిచ్చినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదలమని అన్నారు. ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని కేటీఆర్ మండిపడ్డారు. Also Read:Vaibhav…
తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ షాపులు, ఆర్ఎంపి క్లినికులపై తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా రావిరాలలో శ్రీ బాలాజీ క్లినిక్ లో తనిఖీలు చేశారు. గుండ్లపల్లి నరసింహ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్టెరైడ్స్ తో పాటు 37రకాల ఇతర మెడిసిన్ సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గ్రామంలో మహమ్మద్ మసూద్ అనే వ్యక్తి ఆర్ఎంపి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. Also Read:Nambala Kesava Rao:…
భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీని స్మరించుకోవడమంటే.. తీవ్రవాదం మీద పోరాటం చేయడమేనని అన్నారు. ఆర్ధిక సరళీకృత విధానాలకు మూలం రాజీవ్ గాంధీ.. పహల్గం ఘటన తర్వాత గాంధీ నీ.. 1971 లో పాకిస్తాన్ ను చెరపట్టిన ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్నామని అన్నారు. పాకిస్తాన్ కి శాశ్వత గుణపాటం…
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్రను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసి.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్లో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. 5 రోజులపాటు ఇద్దరిని విచారించనున్నారు పోలీసులు. సిరాజ్, సమీర్ల బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే సిరాజ్ బ్యాంకులో రూ.45లక్షల నగదు గుర్తించారు. సిరాజ్కు డీసీసీబీ బ్యాంకులో లాకర్లు ఉన్నట్లు గుర్తించారు. Also Read:Chhattisgarh: ఛత్తీస్గఢ్లో…
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా వేసవి పూర్తి కానేలేదు అప్పుడే వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి.. ఆవర్తనం కొనసాగుతున్నాయి. ద్రోణి.. ఆవర్తనలా ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. Also Read:Andhra Pradesh: కువైట్ ప్లైట్లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం రాష్ట్ర వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా పోలీసులు ప్రకటించనున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్నారు. ప్రభకర్ రావు ను ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమం అయ్యింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. కాగా జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. Also Read:Gold Rates: ఒక్కరోజులోనే…
సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఐఏఎస్ అధికారి శరత్ అత్యుత్సాహం ప్రదర్శించారు. సభలో పాల్గొనడానికి వచ్చిన సీఎం కాళ్లు మొక్కారు. ఐఎఎస్ శరత్ వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ కాళ్లు ఐఏఎస్ శరత్ మొక్కడంపై ఆల్ ఇండియా సర్వీసెస్ అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే.రామకృష్ణారావు సీరియస్ అయ్యారు. నిబంధనలు…