Turkish Airlines: విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్!
- టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
- ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.
- కోల్‌కతాలో అత్యవసర ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Turkish Airlines: టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో విమానంను కోల్‌కతా విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం సిబ్బందితో కలిపి 236 మంది పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు.
Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
Also Read
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన TK 727 విమానం నేపాల్ రాజధాని కాఠ్మండూ నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. విమానం కోల్‌కతా గగనతలంలోకి వచ్చిన సమయంలో.. ఇంజిన్ లోని ఓ భాగంలో మంటలు చెలరేగినట్లు పైలట్ గమనించాడు. దీనితో పరిస్థితి తీవ్రంగా మారడంతో.. పైలట్ వెంటనే కోల్‌కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ను సంప్రదించాడు.
పరిస్థితిని అంచనా వేసిన కోల్‌కతా ATC.. వెంటనే వారి నుంచి అనుమతి లభించిన వెంటనే విమానాన్ని అత్యంత జాగ్రత్తగా రన్‌వేపై దింపారు. ముందుగానే అప్రమత్తమైన ఫైర్ బ్రిగేడ్ బృందాలు, అత్యవసర సేవలు విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ప్రయాణికులను వరుసగా బయటకు తరలించారు. ప్రస్తుతం విమానానికి మరమ్మతులు జరుగుతుండగా.. ప్రయాణికులందరూ విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం టెక్నికల్ లోపం కారణంగా జరిగిందా లేదా మరో విషయమా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
OnePlus 15R vs iQOO 15R: ఒకే ధర, సేమ్ స్పెసిఫికేషన్స్.. వన్‌ప్లస్ 15R, ఐకూ 15Rలో బెస్ట్ ఫోన్ ఏది?
త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం (TIA) జనరల్ మేనేజర్ టెక్ నాథ్ సీతౌలా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 1:28 గంటలకు టేకాఫ్ అయిన ఈ విమానం కేవలం నాలుగు నిమిషాల్లోనే కుడి ఇంజిన్‌లో మంటలు రావడం గమనించారు. ఈ విమానంలో 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజిన్‌లో మంటల సమాచారం అందిన వెంటనే భద్రతా చర్యలలో భాగంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సుమారు 15 నిమిషాల పాటు పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!