తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. నిరంతరం వినోదం పంచుతూ 83 మిలియన్ల ప్రేక్షకులను, 24 మిలియన్ల ఇళ్లకు చేరువైన జీ తెలుగు తన కొత్త గుర్తింపు ‘ప్రేమతో.. జీ తెలుగు’తో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్లో భాగంగా, జీ తెలుగు ఛానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరించే బ్రాండ్ ఫిల్మ్‌ను ప్రసారం చేసింది. ‘మమతతోనే మాట మధురం’ అనే సిద్ధాంతంతో రూపొందిన ఈ ఫిల్మ్, తెలుగు సంస్కృతి, సమాజం, సమిష్టి భావాల సంగమం.
Also Read: Allu Arjun -NTR – Ram Charan: ముగ్గురు మొనగాళ్లు.. తెలియకుండానే చేస్తున్నారా?
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో జరిగేపెళ్లి తంతును కళ్లకు కట్టినట్లు చూపించారు. బంధుమిత్రుల కోలాహలం మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం పెళ్లి బుట్ట మొదలైన సాంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగు వారి హృదయాలను హత్తుకుంటోంది.
Also Read:Thalliki Vandanam Scheme: మరో ముఖ్యమైన హామీ అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్.. రేపే ఖాతాల్లో నిధులు జమ..!
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు వివాహానికి ముందు అనివార్య కారణాలతో సైనికుడైన తండ్రి విధుల్లో చేరవలసి వస్తుంది. ఆ వేడుకకు తండ్రి దూరంగా ఉన్నాడనే లోటు తెలియకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అంతా ఒక్కటై ఆ వివాహ వేడుకను వైభవంగా జరిపించారు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సైనికుడికి ‘ఇంత పెద్ద కుటుంబం కారణంగా పెళ్లి ఘనంగా జరిగింది’ అని భార్య గర్వంగా చెబుతుంది. ఈ వేడుక‘ మమతతోనే మాట మధురం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఈ వేడుకలో జీ తెలుగు సీరియల్స్ నటీనటులైన జగద్ధాత్రి-కేదార్, అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్, ఆద్య-శ్రీను, రామలక్ష్మి-శౌర్య,భూమితోపాటు మరికొందరు సందడి చేశారు.ఈ బ్రాండ్ ఫిల్మ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రేక్షకులతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి మనసు దోచేలా ఉంది.