తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 36,900 శాంపిల్స్ పరీక్షించగా… 201 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 184 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,747కు పెరగగా.. రికవరీ కేసులు.. 6,69,857కు చేరాయి.. ఇక, మృతుల…
కేటీఆర్ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం శూన్యం అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కేటీఆర్ నాలాలు ఆక్రమణ తొలగింపులు చేయాలని అంటుంటే ఆశ్చర్యమేస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా ఒక్క నాలా ఆక్రమణను తొలగించలేదు అన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న మీ ఎంఐఎం తమ్ముళ్లు భారీగా నాలాలు ఆక్రమణలు చేస్తున్నారు అని చెప్పారు. ఓల్డ్ సిటీ లో నాలాలు చెరువులు కబ్జాకు గురైనవి అన్నారు. అందుకే ఒక్క వర్షం వస్తే ఓల్డ్ సిటీ…
తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో కేంద్ర నిబంధనల మేరకే కొనుగోలు చేస్తాం అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ఏడాది కంటే పదిలక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోతే ఇంకా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసే వాళ్లం. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోను రెండు లక్షల మెట్రిక్ టన్నుల కంటే అదనపు ధాన్యం కొనుగోలు చేయలేదు కేంద్ర నిబంధనలకు నిరసనగా ధాన్యం కొనుగోలు…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు 4 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఈ ప్రక్రియ మొదలుపెట్టిన 165 రోజుల్లో కోటి డోసులు, 233 రోజుల్లోనే రెండు కోట్ల డోసులను, 260 రోజుల్లోనే మూడు కోట్ల డోసులను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు నిండిన 94% మందికి ఫస్ట్ డోస్,…
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. అయితే వర్చువల్ పద్ధతిలో సాగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు ఎండింగ్ కోసం నీటి కేటాయింపుల కోసం సమావేశం నిర్వహించారు. 15 రోజులలో ముగిసే ఖరీఫ్ పంట కోసం కాకుండా రాబోయే యాసంగి సీజన్ కోసం చర్చించాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు ప్రతిపాదనకు ఓకే చెప్పింది ఏపీ. త్వరలో పూర్తి స్థాయిలో నిర్వహించే మీటింగ్ కు హాజరవుతామన్నారు ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి.…
పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి… వికారాబాద్ జిల్లా కొడంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రైతులు పండిస్తున్న వరి పంటను ముఖ్యమంత్రి సహాయ నిధితో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ వరి వద్దంటున్నాడు… ఇక్కడ కేసీఆర్ అదే చెపుతున్నాడని ఫైర్ అయ్యారు. సెప్టెంబర్ లో కేసీఆర్.. మోడీని కలిసి వచ్చిన తరువాత ఇంత వరకు ఏ కేంద్ర మంత్రి దగ్గర అపాటిమెంట్ తీసుకోలేదని మండిపడ్డారు.…
2009, డిసెంబర్ 9కి తెలంగాణకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం చివరి దశకు చేరిన సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో కేసీఆర్ దీక్ష ప్రారంభించారు. అప్పటికే ఆయన దీక్షలో ఉండి కొన్ని రోజులు అవుతుండగా ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకు విషమిస్తుంది. దీంతో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి చిందబరం తెలంగాణ ఏర్పాటు పై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభించామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ…
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని…
సింగరేణిలో సుదీర్ఘకాలం తరువాత సమ్మె సైరన్ మోగింది.నేటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. మరో 11 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు దిగాయి.18 ఏళ్ల తర్వాత అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికి కాకుండా…
తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,085 శాంపిల్స్ పరీక్షించగా… 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 185 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,546కు చేరుకోగా… రికవరీ కేసులు 6,69,673కు పెరిగాయి.. ఇక, మృతుల…