న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. మందు వేద్దాం.. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం.. రచ్చ చేస్తామంటే కుదరదు.. ఎందకంటే.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు తెలంగాణ పోలీసులు.. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరించనున్నారు.. తాగి వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించనున్నారు.. ఇక, రెండో సారి పట్టుబడితే పదిహేను వేల ఫైన్ లేదా రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు.. డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నారు.. మరోవైపు.. ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లే వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌పై అనుమతించారు.. ఇక, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే కూడా మూతపడనుంది.. 1. Cyber towers flyover, 2. Gachibowli flyover, 3. Bio-diversity flyovers 1 & 2, 4. Mind space flyover, 5. Forum Mall-JNTU Flyover, 6. Road No.45 flyover and Durgam Cheruvu Bridge 7. Babu Jagjivan Ram flyover (Balanagar) సహా.. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్టు పోలీసులు ప్రకటించారు.
Read Also: తిరోగమనం వైపు పీఆర్సీ..! మళ్లీ ఉద్యమానికి ఉద్యోగ సంఘాలు రెడీ
ఇక, డిసెంబర్ 31న విధుల్లో ఉండే క్యాబ్, ఆటో డ్రైవర్లకు పోలీసులు పలు ఆదేశాలు జారీ చేశారు.. క్యాబ్, ట్యాక్సీ, ఆటో రిక్షా డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నప్పుడు యూనిఫార్మ్ లో ఉండి అన్ని వాహన డాక్యుమెంట్లు ఉండాలన్నారు.. క్యాబ్ డ్రైవర్లు రైడ్‌కు అనుమతి నిరాకరిస్తే ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని ప్రకటించారు.. ప్రజలు ఫిర్యాదు చేస్తే క్యాబ్ ఆటో ఓనర్స్ పై Section 178 of Motor Vehicles Act, 1988. కింద Rs. 500/- పెనాల్టీ విధింపబడుతుందని తెలిపారు.. ప్రజలు క్యాబ్ నిరాకరిస్తే WhatsApp 9490617346 నంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించిన పోలీసులు.. పబ్లిక్ వద్ద అధిక డబ్బు డిమాండ్ చేస్తూ మిస్ బిహేవ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.. పబ్‌లో తాగి బయటకి వెళ్లే కస్టమర్ తాగి వాహనం నడపకుండా పబ్ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు.. అడుగడుగునా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబడతాయి.. సరైన ధృవపత్రాలు లేకపోతే వాహనాలు కూడా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనం నడిపితే డ్రైవర్, వాహన యజమాని ఇద్దరు జైలుకే నని హెచ్చరించారు.. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా, వాహనంలో అధిక శబ్ధాలతో ప్రయాణిస్తే కూడా బండి సీజ్ తప్పదంటున్నారు.. వాహనాల్లో ఎక్కువ మంది ప్రయాణం, వాహనం మీద కూర్చొని ప్రయాణించడం, పబ్లిక్ స్థలంలో న్యూసెన్స్ క్రియేట్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.