దొర అహంకారాన్ని అణిచి వేయాలి: షర్మిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణ రావాలంటే దొర అహంకారాన్ని అణిచివేయాలని.. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలపై ఆమె స్పందించారు. ట్విట్టర్ వేదికగా …కేసీఆర్ పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు. ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు…ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు… ఓ రోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతు వంతు… ఓ రోజు అసైన్డ్ భూముల కోసం బలైన రైతు వంతు…
మరో రోజు పోడు భూములకై ఆత్మహత్య చేసుకొనే గిరిజన రైతు వంతు.. ఓ రోజు ఫీల్డ్ అసిస్టెంట్‌ల వంతు…ఓ రోజు RTC ఉద్యోగుల వంతు… ఓ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ అందని విద్యార్థి వంతు… ఓ రోజు వైద్యం అందని కరోనా రోగుల వంతు అంటూ.. ఇదేనా కేసీఆర్ పాలనలో బతకలేని తెలంగాణ అని విమర్శించారు. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటే, చావులు లేని తెలంగాణ రావాలంటే దొరగారి అహంకారాన్ని కిందకు దించాలని వైఎస్ షర్మిళ పిలుపునిచ్చారు.
Also Read
KCR పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు.ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు.ఓ రోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతు వంతు.ఓ రోజు అసైన్డ్ భూముల కోసం బలైన రైతు వంతు.మరో రోజు పోడు భూములకై ఆత్మహత్య చేసుకొనే గిరిజన రైతు వంతు 1/2 pic.twitter.com/gRb8qZKUTI
— YS Sharmila (@realyssharmila) December 30, 2021
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
-
AP JUDA: స్టైపెండ్ పెంపుపై జూడాల అసంతృప్తి.. ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ నోటీసులు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!