తెలంగాణలో కమలం పార్టీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే పలువురు కాషాయ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. Read Also: బీజేపీలోకి తెలంగాణ ఉద్యమ నేత…
ఉద్యోగ సంఘాల నేతలుగా ఓ వెలుగు వెలిగి.. టీఆర్ఎస్లో పదవులు అనుభవించి.. ఇప్పుడు ఎందుకు కారు దిగి వెళ్లిపోతున్నారు? బీజేపీవైపు అడుగులు వేయడం వెనక వారి ఆలోచనలేంటి? ఉద్యోగ, రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీలో ఉద్యోగ సంఘాలది కీలక పాత్ర. పలు ఉద్యోగ సంఘాల నేతలు గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో రావడంతో.. ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలకు పార్టీ పదవులు కట్టబెట్టి…
సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి సిమెంట్ కంపెనీలు ఊరట కలిగించే వార్తను అందించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 తగ్గగా… కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బస్తా ధర రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. తాజా ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సిమెంట్ బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.280 నుంచి రూ.320కి లభించనుంది.…
భద్రాచలంలోని రామయ్యను సోమవారం సాయంత్రం ఏపీ మంత్రి కొడాలి నాని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి కొడాలి నాని కుటుంబంతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి కొడాలి నాని శ్రీరాముడికి రూ.13 లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు. ఈ మేరకు కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. Read Also: సైబర్ నేరగాళ్ల వలలో డిప్యూటీ తహసీల్దార్ ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో…
సైబర్ నేరాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు అదునుచూసి.. డబ్బును లాగేస్తూనే ఉన్నారు.. ఎంతో మంది ఇప్పటికే కేటగాళ్ల బారినపడి లక్షల్లో డబ్బును పోగొట్టుకున్న ఘటనలు అనేకం.. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ డిప్యూటీ తహసీల్దార్ సైతం సైబర్ నేరగాళ్ల బారినపడ్డారు. ఈ-కేవైసీ పేరుతో సైబర్ నేరగాళ్లు కామారెడ్డి కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా పని చేస్తున్న రంజిత్‌కు వలవేశారు.. అది కేటుగాళ్ల పనిగా గుర్తించని ఆయన.. వివరాలు చెప్పడంతో.. ఆయన…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో తెలంగాణ సర్కార్ మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గతేడాది మాస్క్ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు. ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
శిల్ప కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిట్టి పార్టీల కోసం దివానోస్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందులో సినీ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. దివానోస్ క్లబ్లో 90 మందిని చేర్చారు. పార్టీలకు వచ్చిన వారికి అధిక వడ్డీ ఎర వేశారు. ఆమె ఆఫర్లను నమ్మి బ్లాక్ మనీని శిల్ప చేతిలో పెట్టారు కొందరు వ్యాపారవేత్తలు. మరోవైపు…శిల్ప కేసులో మరో ఇద్దరు పేర్లు బయటకు వచ్చాయి. షామీర్‌పేటకు…
సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది.. ఇప్పటికే అప్రమత్తమైన చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.. ముఖ్యంగా విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.. ఇక, భారత్ కూడా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు, ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ముఖ్యంగా 11 హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారికి పరీక్షలు తప్పనిసరి చేసింది.. కొత్త వేరియంట్‌తో అలెర్ట్ అయిన తెలంగాణ సర్కార్.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో…
తెలంగాణలో అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో మద్యం విక్రయాలు తగ్గాయి. అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో రూ.2,653 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా… నవంబర్ నెలలో రూ.2,158 కోట్ల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. దీంతో రూ.495 కోట్ల మద్యం విక్రయాలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. నవంబర్‌కు ముందు తెలంగాణలో రోజుకు సగటున రూ.75 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవని… కానీ నవంబర్‌లో రోజుకు రూ.70 కోట్ల విక్రయాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. Read Also:…