తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యోగ సంఘాలు చురుకుగా పనిచేశాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా అంతే యాక్టివ్‌గా ఉన్నాయి. కానీ.. ఆ రెండు సంఘాలకే ప్రాధాన్యం ఇవ్వడంపై.. మిగతావాళ్లు కత్తులు నూరుతున్నారట. ఉద్యమంలో పాల్గొన్నవారిపై ఈ వివక్ష ఏంటని ప్రశ్నిస్తున్నారు. రెండు ఉద్యోగ సంఘాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్నలా తమ పరిస్థితి మారిందని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కొన్ని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. రాష్ట్రంలో…
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. నగర శివారులో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. కాచిగూడ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కోఠిలోని ఓ కాలేజీలో చదువుకుంటుంది.. నాలుగు రోజుల క్రితం బాలిక తనకు తెలిసిన ఆటోలో కాలేజీకి బయల్దేరింది.. అయితే, కళాశాలకు వెళ్తున్న బాలికకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. శివారులోని మేడిపల్లికి తీసుకొని వెళ్లాడు.. మేడిపల్లిలో 4 రోజుల పాటు రోజు ఒకో…
సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్ మొద్దు నిద్ర పోతుండంటూ ఎద్దేవా చేశారు. 2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదని ఆగ్రహించారు. వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందని పేర్కొన్నారు. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారని నిలదీశారు. ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే…
విద్యుత్ నియంత్రణ భవన్ కు శంకుస్థాపన చేశారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ కార్యక్రమంలో… ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు, సీఎండీ ప్రభాకర్ రావు, టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి, స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ… ఈఆర్సీ కొత్త భవన నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని… ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్యావరణానికి హాని కలగకుండా కొత్త నిర్మాణాలు చేపట్టాల్సిన…
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరణ చేయటానికి జీవో నెంబర్ 16ను నిలిపి వేస్తూ గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. తాజాగా ఈ పిల్ నంబర్ 122/2017 ను కొట్టి వేసింది కోర్ట్. అలాగే ఈ పిటిషన్ వేసిన వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు జరిమానా వేసింది. అయితే క్రమబద్దీకరణకు అనుకూలంగా వాదించింది ప్రభుత్వం. ఈ క్రమబద్ధీకరణకు 2016లో…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,730 శాంపిల్స్ పరీక్షించగా… 203 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో ఒక్క కరోనా బాధితుడు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 160 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,77,341కు చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 6,69,488కు పెరిగింది. ఇక,…
తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు గురించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ పై సోనియా గాంధీ ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9… అందుకే డిసెంబర్ 9 ఉదయం 10 గంటల నుండి సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నాము అని తెలిపారు. ఈసారి డిజిటల్ సభ్యత్వ నమోదు ఉంటుంది.కొల్లాపూర్ లో రేవంత్, మధిర లో సిఎల్పీ నేత భట్టి సభ్యత్వ నమోదులో పాల్గొంటారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం గా పెట్టుకున్నాము. జనవరి 26…
నిజామాబాద్ భీమ్ గల్ టీఆర్ఎస్ బహిరంగ సభ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… నిరయోజకవర్గ భివృద్ధిపనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఆలోచన కృషి వల్లనే భీంగల్ మ్యూనిసిపాలిటీగా మరి అభివృద్ధిపతంలో నడుస్తోంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో భీంగల్ పట్టణం ప్రగతి సాధిస్తోంది. కెసీఆర్ ను కడుపులో పెట్టుకుంటున్న గ్రామాలను అభివృద్ధి చేసే భాద్యత మాదే అని తెలిపారు. తెలంగాణ లో అమలయ్యే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలౌతాలేవు.…
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం…