Gold Rates Down: భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..
- స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న పెట్టుబడులు..
- భారీగా పడిపోయిన బంగారం కొనుగోళ్లు..
- ఒక్కరోజే రూ.2,240 వేలు తగ్గిన బంగారం ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు ఒక్కరోజే భారీగా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, డాలర్ విలువలో మార్పులు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లోనూ ధరలు దిగివచ్చాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,240 తగ్గి, రూ.1,57,420 వద్దకు చేరింది. నిన్నటి వరకు రికార్డు స్థాయి ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్న పసిడి, ఈ భారీ తగ్గుదలతో కొంత ఊరటనిస్తోంది. అదేవిధంగా.. ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,050 తగ్గి, ప్రస్తుతం రూ.1,44,300 వద్ద స్థిరపడింది. కేవలం బంగారమే కాకుండా వెండి కూడా భారీగానే తగ్గింది. కిలో వెండి ధర ఈరోజు రూ.4,000 మేర క్షీణించి.. రూ.2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు దాదాపుగా అమల్లో ఉండే అవకాశం ఉంది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
- Electronics Price Hike: టీవీ, ఏసీ, ఫ్రిజ్ ధరలు పెరిగే అవకాశం.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
- RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
Also Read:Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..
ధరలు తగ్గడానికి కారణం ఏంటి..?
మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ (Fed) వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. గత వారం రోజులుగా నిలకడగా పెరిగిన ధరల నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు తమ దగ్గరున్న బంగారాన్ని అమ్మి లాభాలను గడించడం వల్ల మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి.
ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు తగ్గడం సామాన్య ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. అయితే.. అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరల్లో నిరంతరం మార్పులు ఉండే అవకాశం ఉన్నందున.. కొనుగోలుదారులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని గమనిస్తూ ఉండటం మంచిది.
తాజావార్తలు
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!