స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలింగ్ కేంద్రంలో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది… పెద్దపల్లి జిల్లా బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్కి టీఆర్ఎస్ ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు వరుసక్రమంలో ఉండగా.. ఇద సమయంలో ఓదెల మండలం కొలనూరు బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్కు, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఓటర్లకు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.…
2016-17 తరువాత నుండి రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించింది. వర్కర్ టు ఓనర్ పథకం ను 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చాం. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందన లేదు. 12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్…
తెలుగు రాష్ట్రాల రైతులకు కల్పతెరువుగా మారిన నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిర్వహించి నేటితో 66 ఏళ్లు పూర్తవుతోంది. 1955, డిసెంబర్ 10న అప్పటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ డ్యాం నిర్మాణం 1970లో పూర్తయింది. కృష్ణానదిలపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతిపెద్దది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో వేలాది మంది కార్మికుల శ్రమశక్తి ఉంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలామంది కార్మికులు అసువులు కూడా బాశారు. ప్రపంచంలో…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ‘బడుల బాగు’ పథకం త్వరలోనే పట్టాలెక్కనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ.2000 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4000 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు…
తెలంగాణలోని ఐదు జిల్లాల పరిధిలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. కరీంనగర్లో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లో 5,326 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని పోలింగ్…
✍ తెలంగాణలో నేడు ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్✍ ఢిల్లీ: నేడు బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు… నేడు ప్రజల సందర్శనార్థం రావత్ దంపతుల భౌతిక కాయాలు.. ఉ.11 గంటల నుంచి ప్రజలు, ప్రముఖుల సందర్శనకు అనుమతి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి భౌతికకాయాల సందర్శనకు సైనికాధికారులకు అనుమతి✍ ఏపీలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు… పీపీపీ విధానంలో విశాఖ, అనంతపురంలో ఏర్పాటు.. నేడు…
మహబూబ్నగర్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అప్పాయిపల్లి స్టేజీ సమీపంలో 167వ నంబర్ జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎంపీడీవో అటెండర్ విజయరాణి, ఆటో డ్రైవర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ జ్యోతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. Read Also: యాదాద్రిలో ఇక సేవలు ప్రియం.. ఉత్తర్వులు జారీ గాయపడ్డ…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. వీటిలో ఇప్పటికే ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు 10 మంది అభ్యర్థులు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో…
యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది… ఈ మేరకు తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం.. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది.. కానీ, కేసీఆర్ మూడున్నరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేర్చారని తెలిపారు..…
నూతన సచివాలయ నిర్మాణ పనులను పూర్తిచేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో వున్న సచివాలయ పనుల తీరుతెన్నులను గురువారం సీఎం కేసీఆర్ పరిశీలించారు. వేగవంతంగా జరుగుతున్న పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం అభినందించారు. కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ తుది మెరుగులకు సిద్ధమవుతున్న సచివాలయ భవన నిర్మాణ పనులను సీఎం…